Sai Dharam Tej : కడపలో సాయి ధరమ్ తేజ్.. రాజకీయాలపై వ్యాఖ్యలు..

సాయిధరమ్ తేజ్ తాజాగా కడప పెద్ద దర్గాకు వెళ్లాడు. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు సాయిధరమ్ తేజ్.

Published By: HashtagU Telugu Desk
Sai Dharam Tej went to Kadapa Dargah and comments on Politics

Sai Dharam Tej went to Kadapa Dargah and comments on Politics

యాక్సిడెంట్ తర్వాత కోలుకొని సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విరూపాక్ష(Virupaksha) సినిమాతో 100 కోట్ల హిట్ కొట్టాడు. త్వరలో జులై 28న బ్రో(BRO) సినిమాతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా బ్రో. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్ గా సముద్రఖని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలోని రెండో సాంగ్ ని రేపు తిరుపతిలోని ఓ థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. సాయిధరమ్ తేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాడు. అయితే ఇప్పటికే తిరుపతికి చేరుకున్న సాయిధరమ్ తేజ్ తాజాగా కడప పెద్ద దర్గాకు వెళ్లాడు. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు సాయిధరమ్ తేజ్.

సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది నాకు పునర్జన్మ. దేవుడు పునర్జన్మ ప్రసాదించారు. అందుకే ఆలయాలను సందర్శిస్తున్నాను. కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. మామయ్య కలిసి నటించడం మరువలేని అనుభూతి. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. రాజకీయాలపై అవగాహన ఉంటేనే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారు. ప్రస్తుతానికి నేను సినీ రంగంలోనే ఉంటాను. మామయ్య కూడా సినీ రంగంలోనే ఉండమని చెప్పారు అని తెలిపాడు. దీంతో తేజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read : Officer Max : హిట్ 2 చిత్రంలోని ఆఫీసర్ మ్యాక్స్ ఆకస్మిక మరణం

  Last Updated: 14 Jul 2023, 08:35 PM IST