Site icon HashtagU Telugu

Virupaksha Collections : కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. ‘విరుపాక్ష’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన మెగా మేనల్లుడు..

Sai Dharam Tej Virupaksha Movie First Day Collections

Sai Dharam Tej Virupaksha Movie First Day Collections

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కోలుకున్నాక తాజాగా విరూపాక్ష(Virupaksha) సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఏప్రిల్ 21న విరూపాక్ష సినిమా థియేటర్స్ లో రిలీజయింది. సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్ గా కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో SVCC, సుకుమార్(Sukumar) రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. సినిమా ప్రమోషన్స్ చాలా గ్రాండ్ గా చేశారు. రిలీజ్ కు ముందే టీజర్స్, ట్రైలర్స్, ప్రమోషన్స్ తో విరూపాక్ష సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు.

ఇక విరూపాక్ష సినిమా రిలీజయిన మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ అంశాలతో ప్రేక్షకులని భయపెట్టి మెప్పించింది విరూపాక్ష. దీంతో సాయిధరమ్ తేజ్ మంచి విజయం సాధించాడు. ఈ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడని అంటున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా అదరగొట్టేసిందని కామెంట్స్ చేస్తున్నారు. సంయుక్తకు తెలుగులో ఇది వరుసగా నాలుగో హిట్ కావడం విశేషం.

ఇక విరూపాక్ష సినిమా మొదటి రోజు ఏకంగా 12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. చిత్రయూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ గా ఈ సినిమా నిలిచింది. దీంతో తేజ్ అభిమానులు, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విరూపాక్ష సినిమా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 23 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం, వీకెండ్ ఉండటంతో చాలా తక్కువ రోజుల్లోనే విరూపాక్ష బ్రేక్ ఈవెన్ అవుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు.ఇక విరూపాక్ష సినిమా విజయంపై ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా అనేకమంది సెలబ్రిటీలు తేజ్ ని అభినందిస్తూ మంచి కంబ్యాక్ ఇచ్చావని అంటున్నారు.

 

Also Read :   Baahubali 3: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బాహుబలి మళ్లీ వచ్చేస్తున్నాడు, అప్డేట్ ఇదిగో!