Sai Durgha Tej – Vaishnav Tej : నేడు మెగాస్టార్ చిరంజీవి చెల్లి విజయ దుర్గ పుట్టిన రోజు కావడంతో కొడుకులు ఇద్దరూ స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పారు. విజయ దుర్గ తనయులు, మెగా మేనల్లుళ్లు సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోలని పోస్ట్ చేసి బర్త్ డే విషెష్ చెప్పారు.
సాయి దుర్గ తేజ్ వాళ్ళ అమ్మతో దిగిన ఫోటోని పోస్ట్ చేయగా, వైష్ణవ్ తేజ్ తల్లితో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసాడు. దీంతో ఈ రెండు ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక సాయి దుర్గ తేజ్ చేసిన పోస్ట్ కింద సమంత, ఐశ్వర్య మీనన్.. ఇలా పలువురు స్టార్ సెలబ్రిటీలు హ్యాపీ బర్త్ డే ఆంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్, పవర్ స్టార్ మేనల్లుళ్ళుగా పరిచయమయి ఈ ఇద్దరు హీరోలు కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇద్దరు హీరోలకు మామయ్యలు అంటే చాలా ఇష్టం అని తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ కోసం సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక విజయదుర్గ అంటే మెగా బ్రదర్స్ కి కూడా చాలా ఇష్టం. చిరంజీవి అయితే ఓ రాఖి పండక్కి చెల్లికి కోకాపేటలో రెండు ఎకరాలు రాసి ఇచ్చాడు. అలా అన్నాచెల్లెళ్ల ఫ్యామిలీల మధ్య మంచి బంధం ఉంది.
Also Read : Puri Jagannadh – Harish Shankar : ఇండిపెండెన్స్ డే రోజు గురు శిష్యుల మధ్య పోటీ.. నెగ్గేదెవరో..?