Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుండి మరో బ్యానర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఆ గుర్తింపే వేరు. మెగా ఫ్యామిలీ నుండి ఏ అప్డేట్ వచ్చిన మెగా అభిమానుల్లో అది ఓ పెద్ద పండగే. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుండి దాదాపు అరడజను కు పైగానే హీరోలు ఉన్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనుకుండి. కేవలం వీరు హీరోలుగానే కాదు నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. నాగబాబు , పవన్ కళ్యాణ్ , […]

Published By: HashtagU Telugu Desk
Teja Own

Teja Own

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఆ గుర్తింపే వేరు. మెగా ఫ్యామిలీ నుండి ఏ అప్డేట్ వచ్చిన మెగా అభిమానుల్లో అది ఓ పెద్ద పండగే. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుండి దాదాపు అరడజను కు పైగానే హీరోలు ఉన్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిందనుకుండి. కేవలం వీరు హీరోలుగానే కాదు నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. నాగబాబు , పవన్ కళ్యాణ్ , అల్లు అరవింద్ , శిరీష్ , నిహారిక ఇలా చాలామందే సినిమాలు , వెబ్ సిరీస్ , పలు టీవీ షోస్ లు నిర్మిస్తూ నిర్మాతలుగా కూడా రాణిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో నిర్మాత రాబోతున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) స్నేహితులతో కలిసి కొత్త ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించారు. దీనికి ‘విజయదుర్గ ప్రొడక్షన్ హౌస్’ (Vijaya Durga Productions)గా నామకరణం చేశారు. ‘నా తల్లికి ఆమె పేరుపై చిన్న బహుమతిని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. మా మామయ్య ఆశీస్సులతో విజయదుర్గ ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించా. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది’ అని సాయి పేర్కొన్నారు.

తాజాగా సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి నటించిన సత్య షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ సినిమా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా పేరును సాయిధరమ్ తేజ్ నుంచి సాయిదుర్గ తేజ్ అని మార్చుకొన్నాను. నాకు మా అమ్మ పునర్జన్మను ఇచ్చింది. కాబట్టి నా పేరు ఇక నుంచి సాయిదుర్గ తేజ్ అని చెప్పాడు. ప్రతీ ఒక్కరి పేరులో తండ్రి పేరు ఇంటి పేరుతో కలిసి ఉంటుంది. నా తల్లి నా జీవితంలో భాగం కావాలని నా పేరును సాయిదుర్గ తేజ్‌గా మార్చుకొన్నాను. నా తల్లి నాతోపాటు నా లైఫ్‌లో ఎప్పటికీ ఉంటుంది. అలా ఉండాలనే నేను పేరు మార్చుకొన్నాను. అంతకంటే ఏమీ విషయం మరోటి లేదు అని సాయి చెప్పుకొచ్చారు.

Read Also : Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

  Last Updated: 09 Mar 2024, 03:00 PM IST