Site icon HashtagU Telugu

Sai Dharam Tej : పవన్ కు మేనల్లుడు సర్పైజ్ గిఫ్ట్.!

Teju Gift To Pawan

Teju Gift To Pawan

ఏపీ ఉప ముఖ్యమంత్రి , సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కుటుంబ సభ్యుల నుండి వరుస గిఫ్ట్ ను ఆనందపరుస్తున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan )కు తాజాగా వదిన సురేఖ (Surekha), పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టమైన అపురూపమైన కానుక అందించి ఆనంద పరిచారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చిరంజీవిని కలిసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్బంగా మరిదిని ఆశీర్వదించిన కొణిదెల సురేఖ.. అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నును పవన్ కళ్యాణ్‌కు గిఫ్టుగా ఇచ్చారు. దీనికి సంబదించిన వీడియో ను చిరంజీవి సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇది ఇలా ఉండగానే పవన్ కళ్యాణ్ కు ఆయన మేనల్లుడు సాయి తేజ్ (Sai Dharam Tej) సరైజ్ గిఫ్ట్ ఇచ్చారు. స్టార్ వార్స్ లెగో సెట్ను (Star Wars Lego Millennium Falcon) ఆయనకు కానుకగా అందించారు. మేనల్లుడు గిఫ్ట్ చూసి ఎంతో సంతోషించారు పవన్. పవన్ కళ్యాణ్ కు తేజు అంటే ఎంత ఇష్టమో అనేక సార్లు వెల్లడించడం జరిగింది. అంతే కాదు తేజు ప్రమాదానికి గురైన క్రమంలో కూడా ఎంతో బాధపడ్డారు. తేజు కోలుకోవాలని దేవుళ్లను ప్రార్ధించారు. అంతే విధంగా పవన్ కళ్యాణ్ అన్నకూడా తేజు కు ఎంతో ఇష్టం. తాజాగా ఏపీ ఫలితాల్లో పవన్ విజయం సాధించిన క్రమంలో తేజ్ ఎంతో సంతోషించారు. అంతే కాదు పవన్ విజయం సాధించిన నేపథ్యంలో తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు.

Read Also : Ration Storage : పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం – మంత్రి నాదెండ్ల మనోహర్