పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ పక్క సినిమాలు చేస్తూనే జనసేన(Janasena) అనే పార్టీ పెట్టి ఏపీ(AP) రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా ఉన్నారు. ఈ సారి 2024 ఎలక్షన్స్(Elections) ని పవన్ చాలా సీరియస్ గా తీసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేనకు పవన్ అభిమానుల్లో బాగానే మద్దతు ఉంది. మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) అధికారికంగా జనసేనలో జాయిన్ అయి, బాధ్యతలు కూడా తీసుకొని ప్రచారాలు చేస్తున్నారు.
ఇప్పటికే జనసేనకు పలువురు ప్రముఖులు సపోర్ట్ తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు వదిలేసిన తర్వాత ఇన్నాళ్లు అసలు రాజకీయాల గురించే మాట్లాడలేదు. కానీ ఇటీవల ఇండైరెక్ట్ గా తన తమ్ముడికే మద్దతు అని ప్రకటించాడు. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ – పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సాయి ధరమ్ తేజ్ జనసేన పై, తన పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ పాలిటిక్స్ గురించి మాట్లాడాడు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. పాలిటిక్స్ లో ఎంట్రీ గురించి నేను మామయ్యను అడిగాను. రెండు కాళ్ళు రెండు పడవల మీద పెట్టి నడవద్దు అన్నారు. రాజకీయాలపై ఇంటరెస్ట్ ఉంటే రమ్మన్నారు. నా మద్దతు మామయ్యకే. ప్రస్తుతానికి ఓ జనసేన కార్యకర్తగా నేను చేయాల్సింది చేస్తాను. మామయ్య ప్రచారానికి రమ్మని పిలిస్తే కచ్చితంగా వెళ్తాను అని అన్నారు. దీంతో సాయి ధరమ్ తేజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Upasana: చిరు ఇంట్లో ఉపాసనకు బేబీ షవర్.. నెట్టింట్లో ఫొటోస్ వైరల్?