చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా తాలూకా ఓ అప్డేట్ మెగా అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది.
Delhi Railway Station Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు ఆ పుకారే కారణమా..?
ఈ మూవీ లో చిరంజీవి మేనల్లుడు సాయిదుర్గా తేజ్ (Sai Dharam Tej) గెస్ట్ రోల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆన్‌స్క్రీన్‌లోనూ హీరో (చిరంజీవి) మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అన్నట్లే. కాగా దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ‘బ్రో’ (BRO) సినిమాలో ఫుల్ లెంగ్త్‌లో నటించారు. తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ‘చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్ చేస్తా. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. ఇక ఇప్పుడు విశ్వంభర తో తన కోరిక నెరవేరబోతుందని అభిమానులు భావిస్తున్నారు.
కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. డైరెక్టర్ విశిష్ఠ ఈ సినిమాను సోషియో ఫాంటసీ జానర్లో తెరకెక్కిస్తున్నారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. వీఎఫ్స్, సీజీ వర్క్స్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ .200 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికే సినిమా విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.