కొన్నాళ్ల క్రితం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej )యాక్సిడెంట్ కి గురయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యాడు. ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి చాలానే టైం పట్టింది తేజ్ కి. యాక్సిడెంట్ తర్వాత కోలుకొని సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే విరూపాక్ష(Virupaksha) సినిమాతో వచ్చి 100 కోట్ల భారీ హిట్ కొట్టాడు. త్వరలో జులై 28న బ్రో(BRO) సినిమాతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమాని తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్ గా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. మరో ఆరు నెలలు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నట్టు తెలిపాడు.
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. బ్రో సినిమా రిలీజయిన తర్వాత సినిమాలకు ఆరు నెలలు గ్యాప్ ఇస్తున్నాను. నా డ్యాన్స్ మూమెంట్స్ గతంలో లాగా రావట్లేదు. నేను ఫిజికల్ గా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అలాగే ఓ చిన్న సర్జరీ కూడా ఉంది. అది అయ్యాక కొన్ని రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది. అందుకే సినిమాలకు గ్యాప్ ఇస్తున్నాను. ఈ ఆరు నెలలలో ఫుల్ గా రికవర్ అయి వచ్చి నా నెక్స్ట్ సినిమా చేస్తాను అని తెలిపాడు. దీంతో తేజ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూనే త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నారు.