మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ (Sai Dharam Tej) బ్రో తర్వాత మాస్ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారు. గాంజా శంకర్ అంటూ ఒక మంచి మాస్ టైటిల్ తో ఓపెనింగ్ నాడే గ్లింప్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. అయితే సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న టైం లో బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమాను హోల్డ్ లో పెట్టారు. విరూపాక్ష హిట్ అయినా తర్వాత వచ్చిన బ్రో ఎఫెక్ట్ సాయి తేజ్ మీద పడింది.
మెగా హీరోగా మంచి మార్కెట్ ఉన్నా యాక్సిడెంట్ తర్వాత సాయి ధరం తేజ్ లో ఏదో మిస్ అయ్యిందన్న వాదన ఉంది. ఐతే తన వరకు ఫుల్ ఎఫర్ట్ పెట్టేందుకు కృషి చేస్తున్నాడు. ఈ క్రమంలో సంపత్ నంది గాంజా శంకర్ కి ఎక్కువ బడ్జెట్ అడిగినట్టు టాక్. ప్రస్తుతం తేజ్ మీద అంత బడ్జెట్ అయితే వర్క్ అవుట్ అవ్వదని మేకర్స్ అనుకుంటున్నారు. అందుకే సినిమా ఆపేద్దామని ఫిక్స్ అయ్యారు.
ఈలోగా మళ్లీ చర్చలు జరిపి సినిమాను ఇచ్చిన బడ్జెట్ లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. సంపత్ నందికి ఇది మంచి అవకాశం. సితార బ్యానర్ లో హిట్ కొడితే మాత్రం తప్పకుండా తర్వాత మరిన్ని సినిమా ఛాన్స్ లు వస్తాయి. తేజ్ కూడా కొన్నాళ్లుగా మాస్ సినిమాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి గాంజా శనకర్ తో మాసివ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
సాయి తేజ్ సంపత్ నంది కాంబో ఆశించిన ఫలితాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. మార్చి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.
Also Read : 96 Movie Re Release : వాలెంటైన్స్ డే ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్..!