మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)..తన మామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాటలో కొనసాగుతున్నారు. ఓ పక్క సినిమాలు చేస్తుంటే..మరోపక్క పలు సేవ సంస్థలకు , ఆపదలో ఉన్న ప్రజలకు తన వంతు సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా ఏపీ, తెలంగాణ వరద బాధితుల కోసం తన వంతు సాయంగా రూ.20 లక్షలు అందజేశాడు.
అలాగే విజయవాడలోని వాంబే కాలనీలో అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ వృద్ధాశ్రమానికి రెండు లక్షలు అందజేశాడు. ఇలా ఎప్పటికపుడు తన గొప్ప మనసును చాటుకుంటూ వస్తున్న తేజ్..తాజాగా మరో ఫౌండేషన్ కి తన వంతుగా విరాళం అందించాడు. నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన పిల్లలకు వచ్చే గుండె రోగాల అవగాహన కార్యక్రమంలో సాయి దుర్గ తేజ్ ఫ్యామిలీతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అక్కడి పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టారు, వారితో కలిపి ఫొటోలు దిగారు.
ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు 5 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాయి దుర్గ తేజ్ మంచి మనుసుకి మరోసారి ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.
Read Also : Hydraa : పేదలను ముందు పెట్టి బిల్డర్స్ ఇష్యూ ఇస్తున్నారు – భట్టి కీలక వ్యాఖ్యలు