Sai Dharam Tej : ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్.. మెగా మేనల్లుడి ప్లాన్ అదుర్స్..!

Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశొర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్

Published By: HashtagU Telugu Desk
Sai Dharam Tej Chitralahari Sequal Planning Mytri Movie Makers

Sai Dharam Tej Chitralahari Sequal Planning Mytri Movie Makers

Sai Dharam Tej మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశొర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. సాయి తేజ్ ఖాతాలో హిట్ సినిమాగా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కిశోర్ తిరుమల ఈ సీక్వెల్ కథను సిద్ధం చేశారట. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

కిశోర్ తిరుమల చివరగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా చేశాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. అయితే చిత్రలహరి సినిమా సీక్వెల్ ని మెగా ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా అడుగుతుండగా ఆ కథనే కొనసాగించేలా మరో కథ సిద్ధం చేస్తున్నారట.

నేను శైలజ లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన కిశోర్ తిరుమల నుంచి చిత్రలహరి సీక్వెల్ రావడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. సినిమా ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి. సాయి తేజ్ విరూపాక్ష హిట్ అందుకోగా బ్రో సినిమా జస్ట్ ఓకే అనిపించుకుంది.

Also Read : NTR Devara : దేవరకు సమస్యగా మారిన అతను.. ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో టెన్షన్ స్టార్ట్..!

  Last Updated: 23 Feb 2024, 08:05 PM IST