Sai Dhansika కేవలం తమ యాక్టింగ్ టాలెంట్ తోనే హీరోయిన్స్ గా రాణించాలంటే చాలా కష్టమనే చెప్పాలి. ఒకసారి కాకపోయినా ఎక్కడో ఒకచోట గ్లామర్ సైడ్ చూపించాల్సి ఉంటుంది. అలా కాకుండా అలాంటి వాటికి నో చెప్పేస్తా అంటే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.
కోలీవుడ్ లో అలాంటి హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. వారిలో సాయి ధన్సిక ముందుంటుంది. కబాలి సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన సాయి ధన్సిక ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. ప్రస్తుతం ది ప్రూఫ్ అనే సినిమాతో వస్తున్న అమ్మడు ఆ సినిమా ప్రమోషన్స్ లో లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ పై స్పందించింది.
సినిమాల్లో ముద్దు సీన్లు, బెడ్ రూం రొమాన్స్ ఉంది అంటే తాను ఆ సినిమా చేయనని అంటుంది. అవి చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారని తాను నమ్మనని అంటుంది. అయితే అలాంటివి చేయకపోయినా హీరోయిన్ గా రాణిస్తున్న వారు ఉన్నారు. కానీ ముద్దు సీన్స్ లో నటిస్తేనే ఆడియన్స్ లో పాపులారిటీ పెరుగుతుంది. మరి అవకాశాలు కావాలనుకుంటే మాత్రం ఇలానే ఉంటా.. ఇలాంటి సినిమాలే చేస్తా అని గిరిగీసుకుని ఉండకూడదు.
సాయి ధన్సిక ఇప్పటికి కూడా తాను అలాంటి వాటికి అసలు ఒప్పుకోనని అంటుంది. సినిమాల విషయంలో ఎవరి అభిప్రాయం వారిది కాబట్టి సాయి ధన్సిక కోసం ఆమె కోరుకున్న సినిమాలే రావాలని ఆడియన్స్ భావిస్తున్నారు.
Also Read : RGV : ఫస్ట్ టైమ్ తెలుగు దర్శకులతో ఆర్జీవి..!