Sahithi Dasari : సాహితి దాసరి వైసీపీని సపోర్ట్ చేస్తుందా..? ఇండిపెండెంట్‌గా ఎందుకు నామినేషన్ వేసింది..?

సాహితి దాసరి వైసీపీని సపోర్ట్ చేస్తుందా..? ఆమె ఇండిపెండెంట్‌గా నామినేషన్ వెయ్యడానికి గల కారణం ఏంటి..?

  • Written By:
  • Publish Date - May 7, 2024 / 09:27 AM IST

Sahithi Dasari : ఒకప్పుడు పాలిటిక్స్ అంటే కొన్ని కుటుంబాలు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు కల్చర్ మారింది. మెల్లిమెల్లిగా యూత్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తూ.. మార్పు కోసం ముందడుగు వేస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవలే బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది. తాజాగా టాలీవుడ్ యువ నటి సాహితి దాసరి కూడా ఎంపీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీకి దిగుతున్నారు.

ఆంధ్రా అమ్మాయి అయిన సాహితి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ సీటుకి నామినేషన్ వేశారు. ఈ నామినేషన్ తో సాహితి పేరు టాలీవుడ్ లో కొంచెం గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకుంటున్న సాహితి.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కెరీర్ స్టార్టింగ్ టైంలో ఇలా ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయడం వెనుక కారణం ఏంటి..? ఎవరైన ప్రలోభ పెడితే నామినేషన్ వేసారా..? అని సాహితిని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.

దీనికి సాహితి బదులిస్తూ.. తన వెనుక ఎవరు లేరని, చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ పై ఇంటరెస్ట్ ఉందని, ఎప్పటికైనా రాజకీయాలోకి రావాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకనే ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

కాగా సాహితి ఇటీవల కూర్చిమడత పెట్టి సాంగ్ తో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఆ డాన్స్ వీడియోలో సాహితి బ్యాక్‌గ్రౌండ్ వైస్ జగన్ బ్యానర్ కనిపించింది. దీంతో ఆమె వైసీపీ మద్దతురాలని నెట్టింట కామెంట్స్ వినిపించాయి. అంతేకాదు వైసీపీ, జనసేన మధ్య కామెంట్స్ వార్ కూడా జరిగింది.

తాజా ఇంటర్వ్యూలో ఈ వీడియో గురించి కూడా సాహితిని ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “నేను ఏ పార్టీని సపోర్ట్ చేయడం లేదు. లైట్ కోసం టెర్రస్ పైకి వెళ్లి డాన్స్ చేశా. నా వెనుక జగన్ హోర్డింగ్ కనిపించడంతో.. సోషల్ మీడియాలో ఏవేవో అనేసుకొని ఒక ఫ్యాన్ వార్ చేసేసారు. అందుకే ఆ వీడియో సోషల్ మీడియా నుంచి తీసేసా” అంటూ చెప్పుకొచ్చారు.