Site icon HashtagU Telugu

Sachin Daughter: త్వరలో బాలీవుడ్ లోకి సారా టెండూల్కర్ ?

Sara

Sara

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది. ఆమె బాలీవుడ్‌ లోకి ఎంటర్ కాబోతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సారా ఇటీవలి లండన్ యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో పట్టా పొందింది. ఇప్పటికే మోడల్‌గా రాణిస్తూ పలు యాడ్స్‌లో కూడా నటించింది. అందులో ఆమె నటన అద్భుతంగా ఉంటుంది. నిజానికి గతంలోనే షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఓ సినిమా ద్వారా బాలీవుడ్‌కి సారా పరిచయం అవుతారని ప్రచారం జరిగింది. దీంతో సచిన్ రంగంలోకి దిగి తన కూతురు సారా సినిమాల్లో నటించట్లేదని క్లారిటీ ఇచ్చారు. సారా చదువుపై ఫోకస్ చేస్తోందని, తర్వాత ఏం చేస్తుందనేది ఆమె ఇష్టమని సచిన్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక ఈసారి నెటిజన్ల మధ్య జరుగుతున్న చర్చ అయినా నిజమవుతుందా .. లేదా.. అనేది వేచి చూడాలి. కాగా, సారా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు చక్కటి ఫోటోలు అప్ లోడ్ చేస్తుంటారు. ఆమెకు 1.8 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Exit mobile version