Site icon HashtagU Telugu

Game Changer : జరగండి సాంగ్‌లో ఉండే మరో హుక్ స్టెప్ పై థమన్ ఆసక్తికర కామెంట్స్..

Global Star Ram Charan

Global Star Ram Charan

Game Changer : రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న కొత్త చిత్రం ‘గేమ్ చెంజర్’. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో మొత్తం ఏడు పాటలు ఉన్నాయంటూ థమన్ ఇటీవల తెలియజేసారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘జరగండి’ అనే పాట రిలీజ్ అయ్యింది. ఇక ఈ పాటకి ఇండియన్ మైకల్ జాక్సన్ ప్రభుదేవా డాన్స్ కోరియోగ్రఫీ చేసారు. రిలీజ్ చేసిన లిరిక్ సాంగ్ లోని ఓ సింపుల్ హుక్ స్టెప్ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది.

ఆ స్టెప్ ని రీ క్రియేట్ చేస్తూ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పాటలో మరో హుక్ స్టెప్ కూడా ఉందట. ఆ స్టెప్ గురించి థమన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. ఒక ఓటీటీ మ్యూజిక్ షోలో థమన్ జరగండి సాంగ్ గురించి మాట్లాడుతూ.. “సాంగ్ లో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. అది ఇంకా రిలీజ్ చేయలేదు. అది థియేటర్ లో చూసిన తరువాత మాములుగా ఉండదు. రచ్చ రచ్చే” అంటూ ఒక్కసారిగా హై పెంచేశారు. శంకర్ అండ్ ప్రభుదేవా కాంబో అంటే ముక్కాల ముక్కాబుల సాంగ్ గుర్తుకు వస్తుంది. మరి అలాంటి కాంబోకి చరణ్ లాంటి అద్భుతమైన డాన్సర్ దొరికితే.. ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలే ఉంటాయి.

మరి శంకర్ అండ్ ప్రభుదేవా.. చరణ్ తో ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. కాగా ఈ మూవీ సెకండ్ సింగల్ రిలీజ్ అప్డేట్ ని కూడా థమన్ ఇటీవల ఇచ్చారు. ఆగష్టు రెండో వారంలో సెకండ్ సింగల్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరి ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో కూడా చూడాలి. ఇక ఈ మూవీని ఏమో క్రిస్టమస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలియజేసారు.