Site icon HashtagU Telugu

SSMB29: మహేష్,జక్కన్న మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా.. నిర్మాత ఏం చెప్పారంటే?

Mixcollage 18 Feb 2024 08 55 Am 4357

Mixcollage 18 Feb 2024 08 55 Am 4357

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు రాబోతోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాని ఇండియానా జోన్స్ లాంటి కథతో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాజమౌళి రూపొందించబోతున్నారు. కాగా ఈ చిత్రాన్ని కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎస్ గోపాల్ రెడ్డి కూడా భాగం అవుతున్నారట. ఇది ఇలా ఉంటే ఇటీవలే గోపాల్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మేరకు ఇంటర్వ్యూలో గోపాల్ రెడ్డి మహేష్ బాబు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. రాజమౌళి నాలుగో సినిమా చేస్తున్నప్పుడే, అతను భవిషత్తులో గొప్ప దర్శకుడు అవుతాడని భావించాము. అందుకనే అతనితో సినిమా చేయాలని, నేను కె ఎల్ నారాయణ గారు ఆ సమయంలో రాజమౌళి దగ్గర సినిమా కోసం మాట తీసుకున్నాము. అతను మాతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. కానీ తనకి ఉన్న కమిట్మెంట్స్ వల్ల, అది లేటు అవుతూ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది. ఇకపోతే స్క్రిప్ట్ చివరి స్టేజిలో ఉంది. వచ్చే ఏడాది మేలో షూటింగ్ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు.

 

ఇక ఈ మాటలు విన్న అభిమానులు షాక్ గురి అవుతున్నారు. వచ్చే ఏడాది అంటే 2025 మేలో షూటింగ్ కి వెళ్లబోతుందా? మరి రిలీజ్ ఎప్పుడు అవుతుంది? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. అంటే ఈ సినిమా 2027 కు కూడా విడుదల అవుతుందో లేదో అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఈ వాఖ్యలపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. అయితే మహేష్ రాజమౌళి కాంబినేషన్లో మూవీ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుండగా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అభిమానులకు నిరాశ ఎదురవుతూ వస్తోంది.