Rukmini Vasanth రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ది ఫ్యామిలీ స్టార్ తర్వాత వరుస సినిమాలను ఓకే చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కాకుండానే మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాల విషయంలో పర్ఫెక్ట్ ప్లానిన్ తో వస్తున్నాడు విజయ్ దెవరకొండ. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలంగాణా బ్యాక్ డ్రాప్ లో క్రేజీ లవ్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. రుక్మిణి వసంత్ కన్నడలో సప్త సాగరాలు దాటి సినిమా చేసింది. ఆ సినిమా సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ అయ్యే సరికి సినిమాతో అమ్మడికి సూపర్ పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం రుక్మిణి తమిళ్ లో శివ కార్తికేయన్ (Shiva Karthikeyan) హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది.
Also Read : Mega Hero : మెగా హీరో కథ మరో హీరో చేస్తున్నాడా..?
ఇక ఇప్పుడు విజయ్ (Vijay Devarakonda) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. తెలుగు తెర మీద కన్నడ భామల హంగామా తెలిసిందే. వారి దారిలోనే రుక్మిణి కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. విజయ్ కి జతగా రుక్మిణి దాదాపు కన్ ఫర్మ్ అవ్వగా త్వరలోనే ఈ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
ఈ సినిమాతో పాటుగా శ్యాం సింగ రాయ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో కూడా విజయ్ సినిమా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆ సినిమాను పీరియాడికల్ మూవీగా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. తప్పకుండా విజయ్ దేవరకొండ మార్క్ రాబోయే సినిమాల్లో కనిపిస్తుందని అంటున్నారు.