Site icon HashtagU Telugu

Pooja Hegde: పూజాహెగ్డే క్రేజ్ ఢమాల్.. సెకండ్ గ్రేడ్ హీరోలతో నటించేందుకు సై?

Pooja Hegde tollywood

Pooja Hegde

టాలీవుడ్ బుట్టబొమ్మగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన పూజా హెగ్డే ఇటీవల కాలంలో సక్సెస్ రేటులో బాగా వెనుకబడిపోయింది. చేసింది  పెద్ద పెద్ద సినిమాలే అయినా అవన్నీ నిరాశపర్చడంతో పూజాహెగ్డేను నిర్మాతలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆమె స్తానంలో ఇతర హీరోయిన్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూజాహెగ్డే యువ హీరోల (సెకండ్ హీరోలు) తో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తొలొస్తున్నాయి. అవకాశాలు లేక సాయి ధరమ్ తేజ్ చుట్టూ తిరుగుతుందని పుకార్లు వస్తున్నాయి.

ఆమె ఇప్పుడు రెండో దశ హీరోలతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ‘గుంటూరు కారం’ సినిమా నుంచి ఆమెను తొలగించడంతో పూజ క్రేజ్ పడిపోయింది. “మహేష్ బాబు వంటి పెద్ద స్టార్ సరసన నటించే అవకాశం కోల్పోవడంతో స్టార్ స్టేటస్ కూడా తగ్గిపోయింది” అని పలువురు అంటున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్‌జర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్‌లతో సినిమాలు చేయడం ద్వారా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో ఆమె రెమ్యూనరేషన్ రూ. 3 కోట్ల మార్కును కూడా తాకింది.

“సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో పనిచేయాల్సి వస్తే, ఆమె తన పారితోషికంలో విషయంలో కొంత తగ్గించుకోవాల్సి ఉంటుంది” అని పుకార్లు వినిపిస్తున్నాయి. నిజానికి పూజ ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్1 హీరోయిన్. రష్మిక మందన్నా, కీర్తి సురేశ్, శ్రీలీల లాంటి హీరోయిన్స్ వరుసగా రాణిస్తుండంతో పూజా హెగ్డే కు అవకాశం రావడం లేదని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో ఆచార్య, రాధేశ్యామ్ సినిమా నిరాశపర్చగా, బాలీవుడ్ కిసికా భాయ్, కిసికా జాన్ మూవీ కూడా ఘోరంగా విఫలమైంది. దీంతో పూజా కెరీర్ ప్రమాదంలో పడింది.

Also Read: Secret Camera: అమ్మాయిల రూముల్లో సీక్రెట్ కెమెరా, నగ్న దృశ్యాలు రికార్డ్.. చివరకు ఏమైందంటే!

Exit mobile version