Vyjayanthimala : అలనాటి విఖ్యాత నటీమణి, నృత్యకారిణి 91 ఏళ్ల వైజయంతి మాల ఆరోగ్యంపై వదంతులు వ్యాపించాయి. శుక్రవారం రోజు వీటిని ఆమె కుమారుడు సుచీంద్ర బాలి తోసిపుచ్చారు. వైజయంతిమాల ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఈసందర్భంగా వైజయంతి మాల కెరీర్‌లోని ఆసక్తికర విశేషాలను మనం తెలుసుకుందాం..
Also Read :MLA Quota MLCs: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. కీలక అప్‌డేట్
వైజయంతి మాల తొలినాళ్లలో..
- తమిళనాడుకు చెందిన నటి వసుంధరా దేవికి వైజయంతిమాల(Vyjayanthimala) జన్మించారు. తల్లి నుంచి ఆమెకు నటనా వారసత్వం అందింది.
- అచ్చం తల్లి పోలికే.. అని తమిళనాడులోని సినీ ప్రియులు అందరూ వైజయంతిమాల గురించి చెప్పుకునేవారట.
- అమ్మమ్మ దగ్గరే వైజయంతిమాల పెరిగారు.
- వైజయంతి మాల ఐదేళ్లకే క్లాసికల్ డ్యాన్స్ చేశారు.
- 13 ఏళ్ల వయసు నాటికే సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు.
సినిమా రంగంలో ప్రస్థానం..
- 1949లో తమిళంలో ‘వాస్‌కాయ్’ అనే మూవీలో వైజయంతి మాల నటించారు. ఈ మూవీని తెలుగులో ‘జీవితం’ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇదే ఆమె తొలి మూవీ. ఇందులో తెలుగు డబ్బింగ్ వైజయంతి మాలే చెప్పుకున్నారు.
- తదుపరిగా ఎన్నో హిందీ సినిమాల్లోనూ ఆమె నటించారు. వాటిలో హిందీ డబ్బింగ్ కూడా వైజయంతి మాలే చెప్పుకున్నారు.
- 1955లో దేవదాసు సినిమాలో చంద్రముఖి పాత్రలో వైజయంతిమాల నటించారు. ఇందుకుగానూ ఆమెకు ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. అయితే అది హీరోయిన్‌తో సమానమైన పాత్ర అని చెప్పి, అవార్డును వైజయంతిమాల తిరస్కరించారు.
- కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా, ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా ఆమె రాణించారు.
- నటుడు దిలీప్ కుమార్.. మధుబాలకు బ్రేకప్ చెప్పిన తర్వాత వైజయంతిమాలను ప్రేమించారని అప్పట్లో ప్రచారం జరిగింది.
- అప్పటికే ముగ్గురు పిల్లలున్న తండ్రి డాక్టర్ చమన్‌లాల్ బాలిని వైజయంతిమాల పెళ్లి చేసుకున్నారు.
- 1966లో బాలి, తన భార్య రూబి నుంచి విడిపోయారు. నాటి నుంచి వైజయంతి, చమన్‌లాల్ బాలి కలిసి జీవించసాగారు.
- 1967లో బాలికి ఆయన భార్య రూబి నుంచి విడాకులు మంజూరయ్యాయి.
- 1968 మార్చి 10న మద్రాసులో వైజయంతి- బాలి పెళ్లి చేసుకున్నారు. వీరికి సుచేంద్ర అని ఒక బాబు పుట్టాడు.
- డాక్టర్ చమన్‌లాల్ బాలి 1986 ఏప్రిల్ 21న తుదిశ్వాస విడిచారు.
- ఈ ఏడాది జనవరిలో వైజయంతిమాల చెన్నైలో భరతనాట్య ప్రదర్శన ఇచ్చారు.