Rukshar Dhillon వెండితెర మీద అందరికి లక్ కలిసి రావడం జరగదు. కొందరికి ఫస్ట్ సినిమాతోనే లక్ తోడైతే.. మరికొందరికి కొన్ని సినిమాలు చేసి టాలెంట్ చూపిస్తే కానీ అవకాశాలు రావు. అందం అభినయం రెండు బాగున్నా కూడా ఏవో కారణాల వల్ల కొందరి హీరోయిన్స్ కి అవకాశాలు రావు. అలాంటి వారి లిస్ట్ లో ముందుంటుంది రుక్సర్ థిల్లన్. కన్నడలో రన్ ఆంటోని సినిమాతో తెరంగేట్రం చేసిన అమ్మడు తెలుగులో ఆకతాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది.
ఆ సినిమా తో అమ్మడి ఫేట్ మారుతుందని అనుకోగా అది కాస్త రిజల్ట్ తేడా కొట్టడంతో రిస్క్ లో పడింది. ఇక అప్పటి నుంచి సినిమాలైతే చేస్తుంది కానీ సక్సెస్ లు లేక సతమతమవుతుంది. ఇక కెరీర్ లో ఛాన్సులు లేక సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది అమ్మడు. విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో రుక్సర్ కేవలం చిన్న పాత్రకే పరిమితమైంది.
Also Read : Rajamouli : రాజమౌళిని సిరివెన్నెల అలా పిలిచేవారా.. బాహుబలి టైమ్ లో ఆయన రాజమౌళికి ఏం చెప్పారు..!
ఆ తర్వాత తెలుగులో స్పార్క్ సినిమా చేసినా లాభం లేకుండా పోయింది. కింగ్ నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాలో నటించింది రుక్సర్. స్టార్ హీరోయిన్ కటౌట్ అయినా కూడా అమ్మడికి కాలం కలిసి రాక ఇలా చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటుంది. అయితే సినిమాలు ఎలా ఉన్నా తన ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది రుక్సర్.
ఈమధ్య గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తూ రెచ్చిపోతున్న అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్స్ లో కూడా అదరగొట్టేసింది. ఓర కళ్లతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తున్న రుక్సర్ ఇప్పటికైనా సరైన ఛాన్స్ వస్తే సత్తా చాటాలని అనుకుంటుంది.