కన్నడ భామ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) అక్కడ సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ పాపులర్ అయ్యింది. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ యూత్ ఆడియన్స్ కూడా ఆమెకు కనెక్ట్ అయ్యారు. ఐతే రుక్మిణి తెలుగు స్ట్రైట్ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూడగా నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అంటూ ఒక సినిమా సైలెంట్ గా చేసింది. ఆ సినిమా ఎప్పుడు తీశారో కూడా తెలియదు కానీ లాస్ట్ ఇయర్ చివర్లో రిలీజై ఫ్లాప్ అందుకుంది.
ఇక రుక్మిణి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాకు సైన్ చేసిందని లేటెస్ట్ న్యూస్. మరోపక్క కాంతారా 2 లో కూడా రుక్మిణి నటిస్తుంది. ఐతే కాంతారా 2 దాదాపు పూర్తి కావొస్తుండగా ఎన్టీఆర్ (NTR) సినిమాకు సైన్ చేసిన ఆమెను ఆ సినిమా పూర్తయ్యే వరకు ఏ సినిమా చేయొద్దని కండీషన్ పెట్టారట. ఇలాంటిది ఒకటి ఉంటుందని ఊహించని రుక్మిణి వేరే సినిమాలకు కూడా కమిటైందట.
ఎన్టీఆర్ సినిమా రెండేళ్ల దాకా టైం పడుతుంది. అప్పటివరకు ఆ ఒక్క సినిమాకే టైం కేటాయించడం కుదరదు. ఐతే రుక్మిణి వేరే సినిమాలకు సైన్ చేసినా దానికి ఈ మూవీ మేకర్స్ నుంచి పర్మిషన్ రావట్లేదట. మళ్లీ తమ సినిమాకు ఇబ్బంది అవుతుందని అంటున్నారట. అందుకే ఎన్టీఆర్ సినిమా సైన్ చేసి రుక్మిణి కోరి కష్టాలు తెచ్చుకుంది అన్నట్టుగా ఫీల్ అవుతుందట. ఏది ఏమైనా ఎన్టీఆర్ సినిమా పడితే అమ్మడు టాప్ లీగ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.