Site icon HashtagU Telugu

Rukmini Vasanth : ఎన్టీఆర్ తో లక్కీ ఛాన్స్ పట్టేసిన ముద్దుగుమ్మ..!

Rukmini Vasanth NTR Movie

Rukmini Vasanth NTR Movie

మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈమధ్యనే దేవర (Devara) సినిమాతో తన సత్తా చాటారు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన నాడు టాక్ బాగాలేకపోయినా సినిమాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ భుజాన వేసుకుని హిట్ చేశారు. కామన్ ఆడియన్స్ కు కూడా సినిమా యావరేజ్ అనిపించగా ఫైనల్ ఆ వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. దేవర రిలీజై వారం రోజులు అవుతుండగా వారం రోజుల్లో 405 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అదరగొట్టేసింది.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ (NTR) హృతిక్ రోషన్ తో వార్ 2 చేస్తున్నాడు. ఆ సినిమాలో హృతిక్ తో ఢీ కొడుతున్నాడు తారక్. ఇక మరోపక్క ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా లైన్ లో ఉంది. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామని తీసుకోవాలని చూస్తున్నారట.

సప్త సగరాలు దాటి సినిమాతో..

సప్త సగరాలు దాటి సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ను తారక్ కి జతగా నటింపచేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. సప్త సాగరాలు సినిమాతో తెలుగు లో కూడా రుక్మిణికి సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. కచ్చితంగా అమ్మడికి టాలీవుడ్ కలిసి వచ్చేలా ఉందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ తో సినిమా అంటే స్టార్ స్టేటస్ దక్కినట్టే.. తప్పకుండా అమ్మడు ఆ ఛాన్స్ అందుకుంటే మాత్రం దశ తిరిగినట్టే అని చెప్పొచ్చు.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాను ఈ నెల చివరన మొదలు పెట్టబోతున్నారు. ఐతే తారక్ మాత్రం జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.