- వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి చరణ్ – సుకుమార్ మూవీ
- చరణ్ కు జోడిగా రుక్మిణి వసంత్
- తెలుగు లో వరుస భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న రుక్మిణి వసంత్
రంగస్థలం మూవీ తో చరణ్ లోని సరికొత్త కోణాన్ని బయటకు తీసి ఆకట్టుకున్న సుకుమార్, మరోసారి చరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం కాస్ట్ & క్రూ సెలక్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ సమాచారం మేరకు ఈ మూవీ లో ‘సప్త సాగరదాచే ఎల్లో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడి కెరీర్ టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ (RC16) షూటింగ్‌లో బిజీగా ఉండగా, రుక్మిణి వసంత్ ఇప్పటికే టాలీవుడ్ మరో స్టార్ హీరో ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. ఒకే సమయంలో ఇద్దరు అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకోవడం రుక్మిణి క్రేజ్‌ను తెలియజేస్తోంది. తన సహజసిద్ధమైన నటనతో, కళ్ళతోనే హావభావాలు పలికించే ఈ నటి, తెలుగులో టాప్ లీగ్‌లోకి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు కనుక సక్సెస్ అయితే, టాలీవుడ్‌లో రుక్మిణి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయం.
Rukmini Vasant
ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్ చెప్పిన మాటలను ఇప్పుడు మెగా మరియు నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తనకు తెలుగులో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని, వారి నటనను తాను ఎంతో గౌరవిస్తానని ఆమె పేర్కొన్నారు. తాను ఇష్టపడే హీరోలతోనే వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడం ఆమె అదృష్టమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రుక్మిణి స్క్రీన్ ప్రెజెన్స్ మరియు చరణ్-సుకుమార్ మార్క్ మేకింగ్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
