Site icon HashtagU Telugu

Rukmini Vasanth : రుక్మిణి వసంత్ ఖాతాలో మరో లక్కీ ఛాన్స్..?

Vijay Devarakonda romance with Rukmini Vasanth

Vijay Devarakonda romance with Rukmini Vasanth

సప్తసగారాలు దాటి రెండు భాగాలూతో యూత్ ఆడియన్స్ హృదయాలు గెలిచిన కన్నడ భామ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) అటు కన్నడలో వరుస ఛాన్సులు అందుకుంటూ తెలుగు, తమిళంలో కూడా ఆఫర్లు అందుకుంటుంది. ఆల్రెడీ తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా ఒక సినిమాకు హీరోయిన్ గా లాక్ అయ్యింది. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లింది.

ఇక ఈ సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ అనుదీప్ కెవి కాంబినేషన్ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా లాక్ చేసినట్టు తెలుస్తుంది. వీటితో పాటుగా కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతారాలో కూడా రుక్మిణి వసంత్ ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తుంది.

రిషబ్ శెట్టి హీరో కం డైరెక్ట్ చేసిన కాంతార సినిమా ప్రీక్వెల్ గా మరో సినిమా వస్తుంది. ఈ సినిమాను హోంబలె ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ నటిస్తుందని లేటెస్ట్ టాక్. సప్తసాగరాలు దాటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు వరుస ఆఫర్లు అందుకుంటూ అదరగొట్టేస్తుంది.

Also Read : Allu Arjun South Number 1 : అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు.. సౌత్ ఇండియా నెంబర్ 1 పుష్పరాజ్ తగ్గేదేలే..!