Site icon HashtagU Telugu

Mrunal Thakur : మృణాల్ కి చెక్ పెడుతున్న అమ్మడు.. ఆల్రెడీ ఒక ఛాన్స్ మిస్..!

Mrunal Thakur Another Lucky Chance

Mrunal Thakur Another Lucky Chance

Mrunal Thakur సీతారామం తో సూపర్ హిట్ అందుకుని హాయ్ నాన్నతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న మృణాల్ ఠాకూర్ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. అయితే టాలీవుడ్ లో అమ్మడి ఫాలోయింగ్ చూసి తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే తమిళంలో మృణాల్ డిస్కషన్స్ లో ఉన్న ఒక సినిమా ఛాన్స్ అనూహ్యంగా రుక్మిణి వసంత్ కు దక్కింది.

కన్నడలో సప్త సాగరాలి దాచె ఎల్లో సినిమా చేసిన రుక్మిణి ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆల్రెడీ టాలీవుడ్ లో రెండు అవకాశాలు అందుకుందని టాక్. ఐతే తెలుగులో ఆమె సినిమా మొదలు కాకముందే శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తుంది.

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రైం థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో రుక్మిణి పాత్రకు కూడా మంచి స్కోప్ ఉందని తెలుస్తుంది. ముందు ఈ రోల్ కి మృణాల్ ని తీసుకోవాలని అనుకోగా సడెన్ గా రుక్మిణి లైన్ లోకి వచ్చింది. రానున్న రోజుల్లో అమ్మడు మిగతా హీరోయిన్స్ కి కూడా చెక్ పెట్టేస్తుందని చెప్పొచ్చు.