కన్నడ భామ రుఖ్మిణి వసంత్ (Rukhmini Vasanth) పై తెలుగు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అమ్మడు రక్షిత్ శెట్టి నటించి నిర్మించిన సప్త సాగరాలు దాటి సినిమాలో నటించింది. ఈ సినిమా లో ప్రియ పాత్రలో ఆమె ఆడియన్స్ మనసులు దోచింది. సినిమా రెండు భాగాలుగా సైడ్ ఏ సైడ్ బి గా రాగా రెండిటిలో రుఖ్మిణి వసంత్ అలరించింది. సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులో కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా హీరోయిన్ కి ఇక్కడ వరుస ఆఫర్లు వస్తున్నాయి.
We’re now on WhatsApp : Click to Join
ఆల్రెడీ విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమాలో రుఖ్మిణి వసంత్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని తెలుస్తుండగా లేటెస్ట్ గా మరో క్రేజీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఈసారి మాస్ మహరాజ్ రవితేజతో జత కట్టే ఛాన్స్ అందుకుంది అమ్మడు. అనుదీప్ కెవి డైరెక్షన్ లో రవితేజ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ప్రముఖ బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రుఖ్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందట.
విజయ్ దేవరకొండ, రవితేజ ఇద్దరు క్రేజీ హీరోల సినిమాలతో రుఖ్మిణి అదిరిపోయే ఛాన్స్ అందుకుందని చెప్పొచ్చు. ఇద్దరి సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి వెయిట్ ఉంటుంది. సో ఈ రెండు సినిమాల తర్వాత రుఖ్మిణి తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. సప్త సాగరాలు దాటి సినిమాతో రుఖ్మిణి యూత్ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. తప్పకుండా అమ్మడికి తెలుగులో మరిన్ని ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు.
Also Read : Guntur Karam Deleted Scenes : గుంటూరు కారం డిలీటెడ్ ఫైట్ సీన్.. రిలీజ్ చేస్తున్నారా..?
కొద్దిగా టాలెంట్ ఉందంటే చాలు తెలుగు మేకర్స్ వారికి వరుస ఛాన్స్ లు ఇస్తారు. టాలీవుడ్ లో కన్నడ భామలకు మంచి డిమాండ్ ఉంటుంది. మరి రుఖ్మిణి వసంత్ టాలీవుడ్ కెరీర్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.