Rukhmini Vasanth : తెలుగులోనే కాదు కోలీవుడ్ లో కూడా దూసుకెళ్తున్న రుక్మిణి.. ఒక్క సినిమా అమ్మడి ఫేట్ మార్చేసింది..!

కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukhmini Vasanth) తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కన్నడ సినిమా సప్త సాగరాలు సినిమాలో నటించిన ఆమె ఆ మూవీతో సూపర్ పాపులర్

Published By: HashtagU Telugu Desk
Rukmini Vasanth NTR Movie

Rukmini Vasanth NTR Movie

కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukhmini Vasanth) తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. కన్నడ సినిమా సప్త సాగరాలు సినిమాలో నటించిన ఆమె ఆ మూవీతో సూపర్ పాపులర్ అయ్యింది. రక్షిత్ శెట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ అమ్మడు ఆ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా అదే క్రేజ్ తెచ్చుకుంది. సప్త సాగరాలు సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి తెలుగు మేకర్స్ ఆమెకు అవకాశాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకుందని అంటున్నారు.

మరో రెండు తెలుగు సినిమాలు కూడా చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది. ఇదిలాఉంటే సప్త సాగరాలు దాటి సినిమాతో తమిళంలో కూడా రుక్మిణి సూపర్ పాపులర్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే తమిళంలో కూడా అమ్మడు వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. లేటెస్ట్ గా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమాలో అమ్మడు ఫీమేల్ లీడ్ గా ఓకే అయినట్టు తెలుస్తుంది.

మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కే ఈ క్రైం థ్రిల్లర్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. సో ఇటు తెలుగు అటు తమిళం రెండిటిలో రుక్మిణి బిజీ కానుంది. తప్పకుండా రుక్మిణి వసంత్ సౌత్ స్టార్ హీరోయిన్స్ సరసన నిలుస్తుందని చెప్పొచ్చు. సప్త సాగరాలు దాటి సినిమాలో ఆమె నటనకు సౌత్ ఆడియన్స్ అంతా కూడా ఫిదా అయ్యారు.

ముఖ్యంగా లవ్ స్టోరీస్ కి ఆమె పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. తెలుగులో మాస్ రాజా రవితేజ, అనుదీప్ కాంబోలో వస్తున్న సినిమాలో రుక్మిణి నటిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తే మాత్రం రుక్మిణికి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం పక్కా అని చెప్పొచ్చు.

  Last Updated: 14 Feb 2024, 12:28 PM IST