Ruhani Sharma : 7 ఏళ్ల తర్వాత అక్కడ మెరుస్తున్న రుహాని శర్మ..!

Ruhani Sharma తన టాలెంట్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తున్న హీరోయిన్ రుహాని శర్మ. అనుష్క శర్మకు కజిన్ వరసైన రుహాని శర్మ తను ఎంచుకునే ఎలాంటి పాత్రనైనా సరే అదరగొట్టేస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Ruhani Sharma Kollywood Offer after 7 Long Years

Ruhani Sharma Kollywood Offer after 7 Long Years

Ruhani Sharma తన టాలెంట్ తో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తున్న హీరోయిన్ రుహాని శర్మ. అనుష్క శర్మకు కజిన్ వరసైన రుహాని శర్మ తను ఎంచుకునే ఎలాంటి పాత్రనైనా సరే అదరగొట్టేస్తుంది. తెలుగులో చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది. హిందీలో కూడా మంచి ఛాన్సులనే అందుకుంటుంది రుహాని శర్మ.

ఐతే అమ్మడు 2017 లో కోలీవుడ్ లోనే ముందు సౌత్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చేసిన సినిమా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడం వల్ల అమ్మడికి తమిళంలో ఛాన్సులు రాలేదు. ఐతే తమిళ్ నుంచి తెలుగు తెరకు వచ్చిన రుహానికి ఇంక బాగానే ఎంకరేజ్ మెంట్ లభించింది. తెలుగుతో పాటు హిందీ సినిమాలు కూడా చేస్తూ వస్తుంది అమ్మడు.

ఇక లేటేస్ట్ గా అమ్మడు కోలీవుడ్ నుంచి ఆఫర్ అందుకుందని తెలుస్తుంది. 2017 తర్వాత మళ్లీ తమిళ సినిమా ఆఫర్ అందుకోని రుహాని శర్మ ఇన్నాళ్లకు మళ్లీ అక్కడ ఛాన్స్ అందుకుంది. స్టార్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కవిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా కూడా నటిస్తుంది. వెట్రిమారన్ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్స్ మీద ఉంది. మరి రుహానికి ఈ సినిమా అక్కడ మంచి కంబ్యాక్ ఇచ్చేలా చేస్తుందేమో చూడాలి.

Also Read : Pushpa 2 : కల్కి ఎఫెక్ట్ పుష్ప 2 పై కూడానా..?

  Last Updated: 03 Jul 2024, 12:09 PM IST