Site icon HashtagU Telugu

Ruhani Sharma : గ్లామర్ లో హిట్టు అనేలా చేస్తున్న అమ్మడు..!

Ruhani Sharma Kollywood Offer after 7 Long Years

Ruhani Sharma Kollywood Offer after 7 Long Years

Ruhani Sharma చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహాని శర్మ సినిమాల్లో నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ఫోటో షూట్స్ లో మాత్రం ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది. అమ్మడు ఎప్పుడు ఫోటో షూట్ చేసినా గ్లామర్ డోస్ దంచి కొట్టేస్తుంది. అందరు హీరోయిన్స్ మాదిరిగా ఫోటో షూట్స్ తోనే మంచి మైలేజ్ సంపాదిస్తుంది అమ్మడు.

కెరీర్ లో సినిమాల సంగతి ఏమో కానీ రుహాని శర్మ ఫోటో షూట్స్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేలా లేదు. లేటెస్ట్ గా అమ్మడు టైట్ ఫిట్ డ్రెస్ తో క్యాప్ లుక్ తో కెవ్వు కేక అనిపిస్తుంది. నడుము అందాలతో పాటు సోయగాలతో వల వేస్తుంది రుహాని.

ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సైంధవ్ సినిమాలో నటించిన రుహాని మార్చ్ 1న రిలీజ్ అవుతున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ లో కూడా నటించింది. యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలను చేస్తూ ఫోటో షూట్స్ లో మాత్రం తన గ్లామర్ ట్రీట్ అందిస్తున్న రుహాని శర్మ ఎప్పుడు కొత్త ఫోటోస్ షేర్ చేసినా సోషల్ మీడియా అంతా షేక్ అవుతుందని చెప్పొచ్చు.