టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా ‘లైగర్’ భారీ అంచనాలతో విడుదలైన విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా లైగర్ ఘోరంగా ప్లాప్ అయ్యింది. లైగర్ దెబ్బకు డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. తమను ఆదుకోవాలంటూ ఇటీవల చాలామంది ధర్నాకు దిగారు. లైగర్ దెబ్బకు పూరి ఏకంగా ముంబైలోనే కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది.
కానీ పూరి జగన్నాధ్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. దాదాపు పది నెలలు కావస్తున్నా లైగర్ నిర్మాతల నుండి రియాక్షన్ లేదు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 20.80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్యాన్-ఇండియా చిత్రానికిగాను విజయ్ దేవరకొండ మాత్రమే రూ.35 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించేందుకు అనన్య పాండే 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారట.
ఈ మూవీ ఊహించనివిధంగా నిరాశపర్చడంతో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే లైగర్ సినిమా చేసినందుకుగానూ విజయ్ కు పూర్తి స్థాయిలో పారితోషికం అందలేదనే టాక్ ఉంది. విజయ్, అనన్య పాటు లైగర్ మూవీలో రమ్య కృష్ణన్, రోనిత్ రాయ్, మైక్ టైసన్ అతిధి పాత్రలో నటించారు. రమ్యకు కోటి రూపాయలు ఇవ్వగా, రోనిత్ రాయ్‌కు రూ.1.5 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్ తిరిగి చెల్లిస్తే దాదాపు 35 కోట్లు నష్టపోయినట్టే.
Also Read: Never Give Up: వెల్ డన్ గర్ల్.. కీప్ ఇట్ అప్, భారీ వర్షంలోనూ ఆగని పరుగు!