RRR Roars: దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్.. హాలీవుడ్ ను వెనక్కి నెట్టి, 5 అవార్డులను కొల్లగొట్టి!

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో హాలీవుడ్ ను వెనక్కి నెట్టేసి ఐదు అవార్డులను సొంతం చేసుకుంది ఆర్ఆర్ఆర్.

  • Written By:
  • Updated On - March 8, 2023 / 02:16 PM IST

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ సంచలనాలు రేపుతూనే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగానూ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా (RRR) తాజాగా ఈరోజు అమెరికాలో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టేసి ఏకంగా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్‌ క్రిటిక్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా 5 కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఒకేసారి 5 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమా(First Indian Movie)గా రికార్డు సృష్టించింది.

బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం (Best International Film), బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. కాగా బెస్ట్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హెచ్‌సీఏ అవార్డుల కోసం నామినేట్‌ అయ్యింది. కానీ వాటిలో నిరాశే ఎదురైంది. ఈ రెండు కేటగిరీల్లో ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ ది వన్స్‌ సినిమా అవార్డులు గెలుచుకొని సత్తా చాటింది.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ చిత్రం (RRR) విడుదలైనప్పటి నుంచి జనాల మన్నన పొందుతూనే ఉంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్‌ కోసం తారక్‌, చెర్రీ వేసిన స్టెప్పులు భారతీయులతో పాటు విదేశీయులను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ పాటకు పలు అవార్డులు వరించాయి. ముందుగా బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ కేటగిరీలో గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ అవార్డులను గెలుచుకుంది. అదే ఊపుతో ఆస్కార్‌ కోసం ఫైనల్‌ నామినేషన్స్‌కు ఎంపికైంది.

Also Read: Nayanthara: నయన్ సంచలన నిర్ణయం.. జవాన్ తర్వాత సినిమాలకు గుడ్ బై?