Site icon HashtagU Telugu

Ram Charan: మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. హాలీవుడ్ ఎంట్రీపై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే!

Ramcharan

Ramcharan

శ్రీనగర్‌ లో జరుగుతున్న జీ20 సమ్మిట్‌ లో మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) సందడి చేస్తున్న విషయం తెలిసిందే. భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఈ సమ్మిట్ కు హాజరైన ఒకే ఒక హీరో రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆకట్టుకున్న రామ్ చరణ్ కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ మెగా హీరో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇంటరాక్షన్ సందర్భంగా హాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేయడం తనకు అభ్యంతరం లేదని చెప్పాడు. హాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పాడు.

“నేను భారతదేశాన్ని ఎక్కువగా అన్వేషించాలనుకుంటున్నాను. నిర్మాత లేదా దర్శకుడు హాలీవుడ్‌కు (Hollywood) చెందినవారు నాతో సినిమాలు చేయాలనుకుంటే భారత్ లో తీయాలని కండీషన్ పెడ్తా. నేను నా సంస్కృతికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. మన భారతీయ భావాలు చాలా బలంగా ఉన్నాయి. మన సంస్కృతి చాలా బలంగా ఉంది. మన కథల్లో చాలా గౌరవం ఉంది. ఇది సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ సినిమా కాదు, ఇండియన్ సినిమా. మన సినిమాల గురించి ప్రపంచం మాట్లాడుకుంటుంది’’ అని చరణ్ అన్నాడు.

RRR ప్రమోషన్ల సందర్భంగా రామ్ చరణ్ తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ధృవీకరించబడిందని త్వరలో ప్రకటించబడుతుందని వెల్లడించాడు. “అవును, మేము చర్చలు జరుపుతున్నాము, ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి. నేను సెట్‌లోకి వెళ్లడం అనేది రెండు నెలల్లో వెలువడే వార్త” అని ఆయన చెప్పారు జీ సమ్మిట్ లో ఉన్న చరణ్ RRRలోని నాటు నాటు పాటకు కూడా డ్యాన్స్ చేశాడు. వీడియోలో, రామ్ చరణ్ తెల్లటి సాంప్రదాయ దుస్తులను ధరించి, కొరియా రాయబారి చాంగ్ జే-బోక్‌కి నాటు నాటు హుక్-స్టెప్ నేర్పుతున్నట్లు కనిపించారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ ఛేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. ఇప్పటికే గ్లోబర్ స్టార్ గుర్తింపు తెచ్చుకన్న రామ్ చరణ్ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం లభిస్తే గ్లోబల్ ట్యాగ్ దక్కడం ఖాయమే.

Also Read: CM KCR: సర్పంచులకు కేసీఆర్ గుడ్ న్యూస్.. పంచాయతీలకు రూ.1190 కోట్లు!

Exit mobile version