Site icon HashtagU Telugu

Japan box office: జపాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ!

Rrr

Rrr

అక్టోబర్ 21 న జపాన్‌లో విడుదలైన SS రాజమౌళి RRR పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. దేశంలో ఒక భారతీయ చిత్రానికి అత్యధిక మొదటి వారం కలెక్షన్లను నమోదు చేసింది. మొదటి వారంలో JPY73 మిలియన్ ($495,000) వసూలు చేసింది. ఈ చిత్రం జపాన్‌లోని 44 నగరాల్లో విడుదలై జపనీస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ది బాడ్ గైస్, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ సినిమాలను రికార్డులను ఆర్ఆర్ఆర్ బద్దలుకొట్టింది. జపాన్‌లో భారతీయ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసిందని అక్కడి రిపోర్ట్స్ చెబుతున్నాయి.

24 సంవత్సరాల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు, JPY400 మిలియన్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్‌తో జపాన్‌లో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా మిగిలిపోయింది. ఆ తర్వాత SS రాజమౌళి బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది.  JPY170 మిలియన్లతో అమీర్ ఖాన్ 3 ఇడియట్స్ మూడవ స్థానంలో ఉన్నాయి. వారం రోజుల క్రితం రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ సినిమా ప్రమోషన్ కోసం జపాన్ వెళ్లారు. RRR అనేది 1920 స్వాంతంత్ర్య నాటికి సంబంధించిన మూవీ. అల్లూరి గా రామ్ చరణ్, భీమ్‌గా తారక్ తమ నటతో ఆకట్టుకున్నారు.

Exit mobile version