Site icon HashtagU Telugu

RRR At Oscars: ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్.. ‘ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్’గా నామినేట్!

RRR

RRR

దర్శకధీరుడు రాజమౌళి (Rajmouli), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయిలో వచ్చిన ఆర్ఆర్ఆర్ RRR సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. మూవీ మనదేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ సందడి చేసింది. ఇప్పటికే జపాన్ కంట్రీలో రిలీజై సరికొత్త రికార్డులను తిరుగరాస్తోంది. అక్కడ నమోదైన గత సినిమాలను రికార్డులను ఆర్ఆర్ఆర్ అధిగమించింది. ఈ నేపథ్యంలో RRR బృందం 95వ అకాడమీ అవార్డ్స్‌లో నామినేషన్ స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. RRR వచ్చే ఏడాది ఆస్కార్స్‌లో (Oscar) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నామినేట్ కాబోతున్నట్టు తాజా సమాచారం.

ఆస్కార్ 2023కి సంబంధించిన తుది నామినేషన్ల అధికారిక జాబితా వచ్చే ఏడాది జనవరి 24న ప్రకటించబడుతుంది. అయితే ఈవెంట్ మార్చిలో జరుగుతుంది. విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ దాదాపుగా నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నామినేషన్లు వేయాలని సినిమా అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

ప్రస్తుతానికి ‘ఛలో షో’ ఆస్కార్‌కి ఎంట్రీ ఇస్తే, RRR కోసం రాజమౌళి ఉత్తమ నటుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సంగీతం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వంటి అనేక విభాగాల్లో నామినేషన్లను వేశారు. ఇక రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌కి సీక్వెల్‌ను తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నా సినిమాలన్నింటికీ మా నాన్నగారు విజేంద్ర ప్రసాద్ కథా రచయిత. మేం RRR 2 కూడా గురించి చర్చించాం. కథపై చర్చలు నడుస్తున్నాయి’’ అని రాజమౌళి అన్నాడు.

Also Read : Hero Satyadev: ‘గుర్తుందా శీతాకాలం’ ఈ జనరేషన్ గీతాంజలి!