RRR Review: రౌద్రం రణం రుధిరం!

మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, ది కన్‌క్లూజన్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను అందించిన SS రాజమౌళి మరో మెగా బడ్జెట్ తో మనముందుకొచ్చాడు.

  • Written By:
  • Updated On - March 25, 2022 / 04:09 PM IST

సినిమా: RRR

దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి

తారాగణం: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్

బడ్జెట్ : రూ.400 కోట్లు

రేటింగ్: 3/5

మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, ది కన్‌క్లూజన్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను అందించిన SS రాజమౌళి మరో మెగా బడ్జెట్ తో మనముందుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం స్వాతంత్ర పూర్వం నేపథ్యంలో ఉంటుంది. అల్లూరి సీతారామ రాజు (రామ్ చరణ్), కొమురం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) పోరాట యోధుల జీవిత చరిత్రలను ప్రేరణ గా తీసుకొని, కల్పిత కథతో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా మూవీ ఇది.

1920లో తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో కథ మొదలవుతుంది. బ్రిటీష్ పాలన సాగుతుండటంతో వారు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటారు. అదే సమయంలో గోండు తెగకు చెందిన మల్లి అనే అమ్మాయి గొంతు నచ్చడంతో ఆ అమ్మాయిని బలవంతంగా లాక్కుని పోతారు. అందుకు అడ్డుపడిన అమ్మాయి తల్లిని సైనికులు చంపేస్తారు. ఆ అమ్మాయిని కాపాడేందుకు గోండు తెగ నాయకుడు కొమురం భీం వస్తాడు. అందులో భాగంగానే ఢిల్లీలోని బ్రిటీష్ ప్రభుత్వంపై తిరగబడి విధ్వంసం సృష్టిస్తాడు. దాంతో అతడిని ఎలాగైనా పట్టుకొని బంధించాలని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తుంది. పోలీస్ ఉన్నతాధికారులు ఆరా అందుకోసం రామరాజును స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తోంది. రామరాజు బ్రిటీష్ పాలనలో పోలీసు అధికారిగా పనిచేస్తుంటాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గొప్ప కీర్తి అందుకుంటాడు రామరాజు. అయితే అంతకుముందే భీం, రామరాజు కలుసుకుంటారు. వీరిద్దరి మధ్య స్నేహం ఎలా ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళిద్దరి మధ్య ఎలాంటి నాటకీయత చోటుచేసుకుంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

1900ల నాటి పీరియాడికల్ డ్రామాను ఈ తరానికి కొత్తగా చూపించే ప్రయత్నం జరిగింది. భారతీయ సినిమాకి సంబంధించినంతవరకు, ఇంతకుమునుపు చూడని విజువల్స్‌ ఈ మూవీలో చూడొచ్చు. దర్శకుడు రాజమౌళి, తండ్రి రచయిత KV విజయేంద్ర ప్రసాద్ ల కాంబినేషన్ మరోసారి మాయ చేసింది. ఫస్ట్ ఆఫ్ 1 గంట 45 నిమిషాల రన్ టైమ్ ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ముందుకుసాగుతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఇంట్రడక్షన్ చాలా రిచ్ ఉంటుంది. అంతేకాదు.. సినిమా ప్రారంభ సన్నివేశాలు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేస్తాయి. ఆ తర్వాత మొదలయ్యే సీన్స్ యాక్సన్ స్వీక్వెన్స్ కూడా ఈలలు కొట్టించేలా ఉంటాయి. కచ్చితంగా భారతీయ చలనచిత్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు అగ్రభాగం దక్కుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తే, ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత మాత్రం సినిమా కొంచెం స్లోగా సాగుంది. ఇక ఈ సినిమాలో హైలైట్ ఏమిటంటే.. అడవిలో అత్యంత ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో ఒకటిగా చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయే ముగింపుతో రాజమౌళి సెకండాఫ్ మొత్తాన్ని ఎలివేట్ చేశాడు. ఆఖరి 25 నిమిషాల్లో రాంచరణ్, ఎన్టీఆర్ నటన నెక్ట్స్ లెవల్ అని చెప్పక తప్పదు. ముఖ్యంగా పులితో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను హెరెత్తిస్తాయని చెప్పక తప్పదు.

ఎడిటింగ్ గురించి చెప్పాలంటే.. కథనంలో చాలా చిక్కులు లేకుండా సూటిగా సాగుతుంది.  ఇద్దరు కథానాయకులు ప్రత్యర్థులపై విరుచుకుపడే సీన్స్ ప్రేక్షకులను సీట్లలో కూర్చునివ్వకుండా చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. బాహుబలి సిరీస్ మాదిరిగా కీరవాణి సంగీతం అదనపు బాలాన్ని చేకూర్చింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ను తమ భుజాలపై మోశారు.  నీరు, నిప్పుగా ఒకరునుమించి మరొకరు నటించారు. అయితే నటనపరంగా ఇద్దరు గుస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఈ సినిమాలో హిందీ నటుడు అజయ్ దేవగన్ కీలకమైన పాత్రలో మెరిశాడు. ఆ పాత్రకు అజయ్ దేవగన్ మాత్రమే ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తేకానీ అర్థం కాదు. ఆలియా భట్ రామ్ చరణ్ ప్రియురాలి సీతగా ఆకర్షించింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా భారతదేశంలోనే అతిపెద్ద యాక్షన్ డ్రామా పేర్కొనవచ్చు.

ఆర్ఆర్ఆర్ బలాలు

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్

జూనియర్ ఎన్టీఆర్ & రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి యాక్షన్ ఎపిసోడ్

నాటు, నాటు సీక్వెన్స్

ఎన్టీఆర్ టైగర్ సీన్

అజయ్ దేవగన్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ

బలహీనతలు

ద్వితీయార్థం స్లోగా సాగుతుంది.

క్లైమాక్స్ పొడిగింపు