RRR Movie : మరో అంతర్జాతీయ అవార్డు నామినేషన్స్ లో నిలిచిన RRR.. ఈ సారి సినిమా కాదు.. ట్రైలర్

తాజాగా RRR సినిమా మరో అంతర్జాతీయ అవార్డుల రేసులో నిలిచింది. హాలీవుడ్ లో గోల్డెన్ ట్రైలర్ అవార్డులు ప్రతి సంవత్సరం అందచేస్తారు. ప్రత్యేకంగా కేవలం ట్రైలర్స్ కోసమే ఈ అవార్డులను ఇస్తారు.

Published By: HashtagU Telugu Desk
RRR Movi Nominated for Another International Awards

RRR Movi Nominated for Another International Awards

RRR సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాక ప్రపంచవ్యాప్తంగా రీచ్ అందుకొని అన్ని దేశాల ప్రేక్షకులని, సినీ ప్రముఖులను మెప్పించింది RRR. ఇక అవార్డులు కూడా లెక్కలేనన్ని సాధించింది. అంతర్జాతీయంగా, హాలీవుడ్(Hollywood) లో RRR సినిమా పలు విభాగాలలో అవార్డుని సాధించింది. RRR లోని నాటు నాటు(Naatu Naatu) పాట అయితే గోల్డెన్ గ్లోబ్(Golden Globe) అవార్డుతో పాటు ఏకంగా ప్రపంచ సినిమాలో అత్యున్నత అవార్డు ఆస్కార్ కూడా సాధించింది.

RRR నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి RRR సినిమాకు హైప్ వచ్చింది. ఇక హాలీవుడ్ లో అయితే ఈ సినిమాని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ స్టీవన్ స్పిల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్.. లతో పాటలు అనేకమంది స్టార్ యాక్టర్స్, టెక్నీషియన్స్ రాజమౌళిని, RRR సినిమాని అభినందించారు. ఆస్కార్ వచ్చినా ఇంకా RRR హవా తగ్గలేదు. ఇప్పటికి పలు దేశాల్ప్ RRR సినిమా ఆడుతుంది.

తాజాగా RRR సినిమా మరో అంతర్జాతీయ అవార్డుల రేసులో నిలిచింది. హాలీవుడ్ లో గోల్డెన్ ట్రైలర్ అవార్డులు ప్రతి సంవత్సరం అందచేస్తారు. ప్రత్యేకంగా కేవలం ట్రైలర్స్ కోసమే ఈ అవార్డులను ఇస్తారు. ఇందులో కూడా అనేక విభాగాలు ఉన్నాయి. 2023 గోల్డెన్ ట్రైలర్ అవార్డుల నామినేషన్స్ లో RRR ట్రైలర్ నిలిచింది. హాలీవుడ్ లో ఆస్కార్ ప్రమోషన్స్ కోసం RRR సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రత్యేకంగా ఓ ట్రైలర్ ని కట్ చేశారు.

ఇప్పుడు ఆ ట్రైలర్ 2023 గోల్డెన్ ట్రైలర్ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ ట్రైలర్ విభాగంలో నిలిచింది. ఈ విభాగంలో RRR ట్రైలర్ తో పాటు అర్జెంటీనా 1985, బార్డో, కోర్సేజ్, ది ఛాలెంజ్ సినిమాలు పోటీకి నిలిచాయి. అయితే వీటిలో RRR ట్రైలర్ కే అవార్డు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి RRR సినిమా ఇంకో అంతర్జాతీయ అవార్డు తన ఖాతాలో వేసుకుంటుందేమో. సినిమా రిలీజయి సంవత్సరం దాటిపోతున్న ఇంకా RRR హవా తగ్గట్లేదుగా అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు.

 

Also Read : NTR31: ప్రియాంక చోప్రాతో ఎన్టీఆర్ రొమాన్స్, ఆసక్తి రేపుతున్న NTR31 మూవీ

  Last Updated: 07 Jun 2023, 07:53 PM IST