Site icon HashtagU Telugu

RRR: కొమురం భీమ్ పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ లుక్స్ అదుర్స్!

Ntr

Ntr

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR భారీ అంచనాల చిత్రాల్లో ఒకటి. ఇవాళ మేకర్స్ కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌ను షేర్ చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ పోస్టర్ తో హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. Jr NTR తాళ్లతో కట్టేసి.. రక్తం మరకలు నిండి, సిక్స్ ప్యాక్స్ అబ్స్ బాడీగా తో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు, సీతారామ రాజుగా రామ్ చరణ్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. RRR అనేది రామ్ చరణ్ పోషించిన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామాజులు, జూనియర్ ఎన్టీఆర్ పోషించిన కొమరం భీమ్‌ల జీవితాల కల్పిత రీటెల్లింగ్. SS రాజమౌళి తండ్రి KV విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా, సంగీత దిగ్గజం MM కీరవాణి స్వరాలు సమకూర్చారు. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. RRR ప్రపంచవ్యాప్తంగా 2022 జనవరి 7న తెలుగు, హిందీ భాషల్లో థియేట్రికల్‌గా విడుదల కానుంది.