RRR Oscars: సత్తాచాటిన ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ కమిటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కు చోటు

అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.

  • Written By:
  • Updated On - June 29, 2023 / 03:35 PM IST

అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులను ప్రదానంచేసే ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ….ఆస్కార్ కమిటీలో RRR చిత్ర బృందానికి చోటుదక్కింది. హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ తోపాటు సంగీత దర్శకుడు కీరవాణి, గేయరచయిత చంద్రబోస్ , సినిమాటోగ్రాఫర్ సెంథిల్ , ప్రొడక్షన్ డిజైనర్ సిరిల్ కు ఆస్కార్ కమిటీలో స్థానందక్కింది. దర్శకనిర్మాతలు మణిరత్నం, కరణ్ జోహార్ , సిద్ధార్థ్ రాయ్ కపూర్ లకు కూడా ఆస్కార్ కమిటీ ఆహ్వానం పలికింది.

కొత్తగా మొత్తం 398మంది కళాకారులకు….ఆస్కార్ కమిటీలో చోటుదక్కింది. కళాకారులు, నిపుణులను తమ కమిటీలోకి స్వాగతిస్తున్నందుకు అకాడమీ గర్విస్తోందని అకాడమీ CEO బిల్ క్రామెర్, అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. తమతమ విభాగాల్లో అసాధారణమైన ప్రతిభ చూపిన వీరంతా….ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులపై ఎంతో ప్రభావాన్ని చూపారని కొనియాడారు.

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ గా నిలిచి ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కుమురం భీంగా ఎన్టీఆర్ నటించారు. కలెక్షన్స్ తో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో ఆర్ఆర్ఆర్ టీం అంతా ఒక్కసారిగా ప్రపంచమంతా గుర్తింపు పొందారు. హాలీవుడ్ లో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళిలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Spy Review: నిఖిల్ మరో హిట్ కొట్టాడా.. ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే!