Jr NTR Vs Ram Charan: పచ్చని స్నేహంలో ‘ఆర్ఆర్ఆర్’ చిచ్చు.. ఎన్టీఆర్, చరణ్ ఫ్రెండ్ షిప్ కటీఫ్!

మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం బలహీనపడిందా? ఇద్దరు స్టార్స్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయా?

  • Written By:
  • Updated On - April 18, 2023 / 02:44 PM IST

ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో కచ్చితంగా టాలీవుడ్ (Tollywood) పేరు కూడా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ (RRR), పుష్ప, బాహుబలి లాంటి సినిమాలు టాలీవుడ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాయి. బాలీవుడ్ స్టార్స్ సైతం టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారంటే మన తెలుగు చిత్రసీమ సామార్థ్యం ఏంటో ఇట్టే తెలిసిపోతోంది. వివిధ ఆడియో ఫంక్షన్లు, ప్రిరిలీజ్ వేడుకల్లో మన టాలీవుడ్ హీరోలు ఇతర హీరోలతో స్టేజీని పంచుకోవడం సర్వ సాధారణంగా మారింది. అవకాశం వచ్చినప్పుడల్లా ఇతర హీరోలపై అభిమానం చాటుకుంటున్నారు. ఒక్క అడుగు ముందుకేసి ‘‘తామంతా ఒక్కటే’’నని స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం హీరోల మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదని ఫిల్మ్ నగర్ టాక్.

బెస్ట్ బడ్డీస్

టాలీవుడ్ స్టార్స్, బెస్ట్ బడ్డీస్ అనగానే రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ Jr NTR పేర్లు వెంటనే గుర్తుకొస్తాయి. వీరిద్దరి మధ్య ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో వీరిద్దరిని కలిపాడు. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇద్దరు స్టార్స్ నటనకు, స్టెప్పులకు ఆస్కార్ (Oscar) అవార్డు కూడా వచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ (రిలీజ్ కు ముందు) రామ్ చరణ్, ఎన్టీఆర్ చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. తామిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని, ఆర్ఆర్ఆర్ తో మరింత బలపడిందని పరోక్షంగా చెప్పారు.

ఆర్ఆర్ఆర్ తర్వాత

గత ఏడాది RRR ప్రమోషన్‌లో నటులు రామ్ చరణ్, JR ఎన్టీఆర్ మధ్య జరిగిన బంధం అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ తాజా నివేదికలు వీరిద్దరి మధ్య అంతా బాగాలేదని, వారి మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు నటులు చివరిసారిగా ఆస్కార్స్‌లో దర్శకుడు SS రాజమౌళి, RRR టీమ్ సభ్యులతో కలిసి కనిపించారు. కానీ ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎక్కడా కూడా కలుసుకోలేదు, కనీసం సోషల్ మీడియాలో ను విష్ చేసుకోలేదు. ఇటీవల విశ్వక్ సేన్ చిత్రం దస్ కా ధమ్కీని ప్రమోట్ చేస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగంలో రామ్ చరణ్ పేరును ప్రస్తావించలేదు. టీమ్ RRR గురించి ప్రస్తావించేటప్పుడు రామ్‌ను అభినందించలేదు.  కాగా ఇటీవల మెగాహీరో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్స్ ఆ ఈవెంట్ కు హాజరైనప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా (Skip) ఉన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య బాండింగ్ బాగాలేదని సోషల్ మీడియాలో వార్తలు కూడా వినిపించాయి.

నో ఇన్విటేషన్

ఇక గోల్డెన్ గ్లోబ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ (Interview) లో రామ్ చరణ్‌కు జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య ఏదైనా పోటీ ఉందా అని అడిగారు. చరణ్ స్పందిస్తూ తమ స్నేహాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు ఈ చిత్రం ఉపయోగపడిందని పేర్కొన్నారు. వారి మధ్య నిస్సందేహంగా కొంత ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పటికీ, ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం ఫ్రెండ్ షిప్ బాండింగ్ అంత బాగోలేదని చెబుతున్నాయి. ఇక ఇటీవలనే ఎన్టీఆర్ తన ఇంట్లో విందు పార్టీని ఏర్పాటు చేశాడు. త్రివిక్రమ్, రాజమౌళి హాజరైనప్పటికీ రామ్ చరణ్ కనిపించకపోవడంతో ఇద్దరి ఫ్రెండ్ షిప్ బెడిసికొట్టందనే వార్తలు మరోసారి చక్కర్లు కొట్టాయి. అయితే ఇద్దరి స్టార్స్ మధ్య ఆర్ఆర్ఆర్ విజయం చిచ్చుపెట్టిందనే రూమర్స్ కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఆస్కార్ అవార్డు కూడా వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలకు కారణమైందని మరో టాక్ వినిపిస్తోంది.

Also Read: NTR30 Update: విలన్ వచ్చేశాడు.. ఎన్టీఆర్ తో బాలీవుడ్ రావణ్ డిష్యూం డిష్యూం!