RRR: RRR ఖాతాలో మరో అరుదైన ఘనత..!

‘RRR’ సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులనూ సొంతం చేసుకుంది. తాజాగా RRR సినిమా మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్న‌ది. ఆస్కార్ నామినేష‌న్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట‌కు స్థానం ద‌క్కింది.

  • Written By:
  • Publish Date - December 22, 2022 / 08:55 AM IST

‘RRR’ సినిమా విడుదలైన దగ్గరి నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులనూ సొంతం చేసుకుంది. తాజాగా RRR సినిమా మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకున్న‌ది. ఆస్కార్ నామినేష‌న్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట‌కు స్థానం ద‌క్కింది. బెస్ట్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిల్మ్ విభాగంలో ఇండియ‌న్ సినిమా ‘చెల్లో షో’ కూడా షార్ట్ లిస్ట్‌కు ఎంపికైంది.

ఉత్తమ సాంగ్స్ కేట‌గిరీల్లో 81 ట్యూన్‌లలో 15 పాటలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. RRRతో పాటు ఇతర పాటల్లో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ నుండి ‘నథింగ్ ఈజ్ లాస్ట్’, ‘బ్లాంక్ పాంథర్: వకండ ఫారెవర్’ నుండి ‘లిఫ్ట్ మీ అప్’, ‘టాప్ గన్: మావెరిక్’ నుండి ‘హోల్డ్ మై హ్యాండ్’ సాంగ్స్ ఉన్నాయి. గురువారం తొమ్మిది కేట‌గిరీల్లో షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల జాబితాను అకాడ‌మీ అనౌన్స్‌చేసింది. ఇందులో ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట స్థానాన్ని ద‌క్కించుకుంది.

Also Read: కర్లీ హెయిర్ లో క్యూట్ భామలు ..

ఈ షార్ట్ లిస్ట్ చేసిన 15 సినిమాల నుంచి జ‌న‌వ‌రిలో ఐదు సినిమాల్ని ఆస్కార్‌కు నామినేట్ చేస్తారు. ఆ సినిమాలు మాత్ర‌మే ఆస్కార్‌కు పోటీప‌డ‌తాయి. బెస్ట్ ఫీచ‌ర్ ఫిల్మ్‌, బెస్ట్ యాక్ట‌ర్స్ షార్ట్ లిస్ట్ జాబితాను జ‌న‌వ‌రి రెండో వారంలో ప్ర‌క‌టించ‌బోతున్నారు. మొత్తం ప‌దిహేను కేట‌గిరీల్లో ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌కు ఇండివిజువ‌ల్‌గా అప్లై చేసింది. అందులో నుంచి ప్ర‌స్తుతం ఒక కేట‌గిరీలో ఈ సినిమా షార్ట్ లిస్ట్ జాబితాలో ఎంపిక‌కావ‌డంతో అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టించారు. అలియాభ‌ట్‌, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా న‌టించారు.