Site icon HashtagU Telugu

Rave Party : అడ్డంగా దొరికిన జబర్దస్త్ ఫేమ్ రోహిణి ..?

Rohini Arrested In A Rave P

Rohini Arrested In A Rave P

రేవ్ పార్టీ (Rave Party) లు అనేవి కామన్ గా మారిపోయాయి. వీకెండ్ వస్తే చాలు చాలామంది ఈ రేవ్ పార్ట్ లలో జాయిన్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సినీ స్టార్స్ కూడా పెద్ద సంఖ్యలో ఈ పార్టీ లలో జాయిన్ అవుతారు. కానీ ఇది రహస్యంగా ఉంటుంది. ఒకవేళ బయటకు వస్తే తమ ఇమేజ్ కి ప్రాబ్లెమ్ అని చెప్పి కొంతమంది రహస్యంగా ఉంచుతారు..మరికొంతమంది మాత్రం కొన్ని సార్లు మీడియా కు అడ్డంగా దొరికి వైరల్ అవుతుంటారు. కొద్దీ రోజుల క్రితం నటి హేమ (Hema) కూడా ఇలాగే బెంగుళూర్ రేవ్ పార్టీ లో అడ్డంగా దొరికింది. కాకపోతే ఆమె డ్రగ్స్ తీసుకుందని తేలడం తో ఆమెను అరెస్ట్ చేసి జైలు కు తరలించారు. ఆ తర్వాత బెయిల్ ఫై బయటకు వచ్చిందనుకోండి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మరో నటి రేవ్ పార్టీ లో అడ్డంగా దొరికినట్లు ఓ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. సీరియల్ నటి గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న రోహిణి (Jabardasth Rohini)..ఆ తరువాత జబర్దస్త్ షో లో గెస్ట్ గా వచ్చి ఆ తర్వాత కమెడియన్ గా మారిపోయి.. పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇప్పుడిప్పుడే కెరియర్ ను స్పీడ్ చేస్తూ.నాల్గు రాళ్లు వెనకేసుకుంటున్న ఈమె..తాజాగా ఓ రేవ్ పార్టీకి వెళ్లినట్లు తెలుస్తుంది. కానీ ఇది నిజమైన రేవ్ పార్టీ లాగా కనిపించడం లేదు. ఏదో సినిమానో..లేదా సీరియల్ కు సంబదించిన సన్నివేశంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమెను వెంటాడుతున్న మీడియా ప్రతినిధుల మైక్ మీద అసలు లేని చానల్ సింబల్ కనిపిస్తోంది. అయితే ఇది బర్త్డే బాయ్ సినిమా ప్రమోషన్స్ అని తెలుస్తుంది. నాకేం సంబంధం లేదు సార్, బర్త్డే పార్టీ ఉందని చెబితే వచ్చాను అంటూ ఆమె చెబుతుండగా నీకు పాజిటివ్ వచ్చింది అంట కదా అని ఒక మీడియా ప్రతినిధి అడుగుతున్నట్టు కనిపిస్తుంది. దానికి ఆమె నాకు అసలు టెస్ట్లే చేయలేదు ఎలా పాజిటివ్ వస్తుందని అనడంతో పాటు ఈ ఎన్నారైలు బర్త్డే పార్టీ అని పిలిస్తే ముందు వెనకా ఆలోచించకుండా ఏ మాత్రం రాకూడదు అంటూ ఏడుస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే ఇది ప్రమోషనల్ వీడియో అనే విషయం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ వీడియో చక్కర్లు కొడుతుండడంతో రోహిణి రేవ్ పార్టీ లో దొరికిందంటూ అంత ప్రచారం చేస్తున్నారు.

Read Also :

Exit mobile version