హీరోయిన్ రీతూ వర్మ తాజాగా నటించిన చిత్రం మజాకా. సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. శ్రీనాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు. రీతూ వర్మ కూడా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో యాక్టివ్ గా పాల్గొంటోంది. అలాగే ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతోంది.
ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగానే రీతూవర్మ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌స్క్రీన్ ముద్దు సన్నివేశాలకు నేను వ్యతిరేకం కాదు. అవకాశం వస్తే కిస్, హగ్ సన్నివేశాల్లో కూడా యాక్ట్ చేస్తాను అని తెలిపారు రీతూవర్మ. ముద్దు సన్నివేశాలకు సంబంధించిన చిత్రాల్లో నాకు అవకాశం రాలేదు. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయడానికి నేను ఏమాత్రం ఇబ్బంది పడను. ఈ అమ్మాయి ఇలాంటి పాత్రలు చేయదని కొంతమంది ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఆ కారణంతోనే నా వద్దకు అలాంటి కథలు రావడం లేదు అనుకుంటా అని రీతూవర్మ తెలిపారు. అంటే ఇకమీద ఫీచర్లో అలాంటి పాత్రలు వచ్చినా తను చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పకనే చెప్పింది.
మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి మరి. రీతూవర్మ విషయానికి వస్తే.. ఆమె తెలుగులో స్వాగ్, పెళ్లిచూపులు 2, కనులు కనులను దోచాయంటే, వరుడు కావలెను, టక్ జగదీష్, నిన్నిలా నిన్నిలా, ఎవడే సుబ్రహ్మణ్యం, నా రాకుమారుడు వంటి సినిమాలలో నటించి మెప్పించింది. ఈ సినిమా హిట్ అయితే ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి మరికొన్ని సినిమాలు యాడ్ కావడం ఖాయం అని చెప్పవచ్చు. మజాకా సినిమా రీతూ వర్మ కు ఏ మేరకు సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి మరి.