వెంకటేష్ హీరోగా నటించిన గురు (Guru) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన రితిక సింగ్ గాయపడింది. ప్రస్తతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న రితిక… ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajanikanth) హీరోగా నటిస్తున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. టీఎస్. జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో రీసెంట్ గా చిత్ర సెట్ లో జాయిన్ అయినా రితిక్..మంగళవారం సెట్ లో జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
‘నాకు తోడేలుతో పోరాడినట్లు అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలని అందరూ హెచ్చరించారు. కానీ నేను గాయపడ్డాను. అందుకు చాలా బాధగా ఉంది. కొన్నిసార్లు వేగాన్ని నియంత్రించడం కష్టం. నా నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగింది. కానీ ఇప్పుడు నొప్పి లేదు. గాయం లోతుగా తగిలింది. ట్రీట్‌మెంట్ కోసం షూట్ నుంచి హాస్పిటల్‌కి వెళ్తున్నా. ఆరోగ్యంగా ఉన్న తర్వాత మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాను’ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.
Read Also : CM Revanth Reddy : ఆల్ టైమ్ బెస్ట్ సీఎంగా రేవంత్ అవుతారు – వర్మ