Tollywood: తెలుగు సినిమా కొత్త శిఖరాలను అధిరోహించి, భారతీయ సినిమాలో అనేక అడ్డంకులను అధిగమించింది. నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగా పెరగడంతో పాటు థియేట్రికల్ డీల్స్ కూడా భారీగా పెరిగాయి. మన స్టార్ హీరోలు కూడా తమ పారితోషికాన్ని పెంచి తమ మార్కెట్, సక్సెస్ తో సంబంధం లేకుండా పెద్ద డిమాండ్ చేస్తున్నారు. హఠాత్తుగా తెలుగు సినిమాల హిందీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ తగ్గిపోయాయి. ఇది నిర్మాతలకు రిస్క్ గా మారడంతో పెట్టిన పెట్టుబడులను రాబట్టుకోవడానికి థియేట్రికల్ ఆదాయంపై ఆధారపడాల్సి వస్తుంది. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతకు భారీ నష్టాన్ని చవిచూడక తప్పదు. డిస్ట్రిబ్యూటర్లు ఈ గేమ్ లో పెద్ద పందెం వేసి డబ్బులు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు.
కాబోయే సినిమాల నిర్మాతలు కొందరు స్టార్స్ ని, యంగ్ యాక్టర్స్ ని వారి రెమ్యునరేషన్ విషయంలో ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందరూ వారి రెమ్యునరేషన్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటారు. వీరిలో కొందరు బడ్జెట్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ సినిమా మేకింగ్, వర్కింగ్ డేస్, సిబ్బంది సంఖ్య, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది కూడా చాలా కష్టం. భవిష్యత్తులో డిమాండ్లు, బడ్జెట్లు, మార్కెట్ దృష్ట్యా నిర్మాతలకు కష్టమే.