Site icon HashtagU Telugu

NTR31 : ఎన్టీఆర్, నీల్ సినిమాలో రిషబ్ శెట్టి..? మూవీ చర్చల్లో సమయంలో కూడా..!

Rishab Shetty, Ntr, Prashanth Neel, Ntr31

Rishab Shetty, Ntr, Prashanth Neel, Ntr31

NTR31 : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమలతో అఫీషియల్ గా కూడా లాంచ్ చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ని త్వరలోనే మొదలు పెట్టనున్నారు. కాగా ఈ మూవీలో నటించబోయే నటీనటుల వివరాలను ఇంకా తెలియజేయలేదు. అయితే ఈ సినిమా చర్చలు జరుగుతున్న సమయం నుంచి ఒక పెద్ద హీరో.. ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ తో ఎక్కువుగా కనిపిస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు, కాంతార నటుడు రిషబ్ శెట్టి.

ఎన్టీఆర్ తో ఈ మూవీ చర్చలు జరుగుతున్న సమయంలో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, NTR31 చిత్ర నిర్మాతలు మరియు రిషబ్ శెట్టి కూడా కనిపించారు. అయితే ఆ సమయంలో రిషబ్ శెట్టి, NTR31 మూవీ యూనిట్ మీటింగ్ యాదృచ్చికం అనుకున్నారు. కానీ ఆ తరువాత కూడా రిషబ్ శెట్టి.. ఎన్టీఆర్ టీంతో కనిపిస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ తన తల్లి షాలిని కోరికని తీర్చడం కోసం కర్ణాటకలోని కుండపురలో ఉన్న ప్రముఖ ఉడుపి శ్రీకృష్ణ మాత ఆలయంకి వెళ్లారు.

ఎన్టీఆర్ తన తల్లితో పాటు ఆ గుడికి వెళ్లడంలో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి సహాయం చేయడంతో పాటు.. దగ్గరుండి దర్శనం కూడా అయ్యేలా చేసారు. ఇలా ప్రతిసారి రిషబ్ శెట్టి.. ఎన్టీఆర్, నీల్ తో కనిపిస్తుండడంతో NTR31 సినిమాలో ఆయన కూడా నటిస్తున్నారా..? అనే సందేహం కలుగుతుంది. ప్రశాంత్ నీల్ గత సినిమా సలార్ లో ప్రభాస్ తో పాటు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు NTR31లో కూడా అలాంటిది ఏమైన ప్లాన్ చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. మరి నీల్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి.