Site icon HashtagU Telugu

Kantara: ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు చెప్పిన రిషబ్ శెట్టి.. ఎందుకో తెలుసా..?

Rishabh Imresizer (1)

Rishabh Imresizer (1)

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇటీవల కాంతార మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కన్నడలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనవిజయాన్ని సాధించింది. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు, విమర్శకులు కాంతార మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే.. తాజాగా ఈ సినిమా చూసిన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి ప్రశంసలను తెలిపారని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు రిషబ్ శెట్టి.

“కాంతార చూసిన వెంటనే ఆయన (ఎన్టీఆర్) నాకు కాల్ చేశారు. ఎంతగానో మెచ్చుకున్నారు. అందుకని నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను” అని అన్నారు రిషబ్ శెట్టి. ఇక వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చాలా బాగుంటుందని అలాంటి ప్రాజెక్టు ఏమైనా ఆలోచించారా అని అడగగా “అలా ఎప్పుడూ ఆలోచించలేదన్నారు. “లేదు నేను దాని గురించి ఆలోచించలేదు. కథ, కాన్సెప్ట్‌ను ఖరారు చేసిన తర్వాతే నటీనటుల ఎంపిక గురించి ఆలోచిస్తాను. ముందుగా నటుడిని దృష్టిలో ఉంచుకుని నేను స్క్రిప్ట్‌ని ఎలా డెవలప్ చేయాలనే ఆ ఆలోచనా విధానం నాకు లేదు. కథ రాయడం పూర్తయిన తర్వాత నటీనటుల ఎంపిక గురించి ఆలోచిస్తాను” అని శెట్టి పంచుకున్నారు. కాంతారతో పాటు రిషబ్ తన 2016 కన్నడ రొమాంటిక్- కామెడీ కిరిక్ పార్టీకి కూడా దర్శకత్వం వహించాడు. దీని సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని అడగగా.. రెండు నెలల బ్రేక్ తీసుకున్న తర్వాతే మిగతా సినిమాలు గురించి ఆలోచిస్తానని అన్నారు. కాంతార సీక్వెల్ గురించి ఇప్పుడే మాట్లాడటం కష్టమని ఇంకా తాను కాంతారా సినిమా ప్రమోషన్స్ లోనే ఉన్నానని అన్నారు.

Exit mobile version