ప్రశాంత్ వర్మ (Prashanth Varma ) డైరెక్షన్ లో ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన సినిమా హనుమాన్ (Hanuman). ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ చూపించిన తెగువ అందరికీ తెలిసిందే. ఐతే హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ఉంటుందని ప్రకటించారు. ఐతే జై హనుమాన్ లో నటించే స్టార్ కాస్ట్ పై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతుంది. కాగా గత కొద్దీ రోజులుగా కాంతారా స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ మూవీ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు షికార్లు కొడుతున్నాయి. అయితే ఇది నిజామా..కదా అనే సందేహంలో అభిమానులు ఉండగా..ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెట్టారు ప్రశాంత్ వర్మ.
జై హనుమాన్ (Jai Hanuman) లో కన్నడ హీరో రిషభ్ శెట్టి లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. కాంతార తో పాన్ ఇండియా ఫేం తెచ్చుకున్న రిషభ్ శెట్టి ఇప్పుడీ పాన్ ఇండియా సక్సెస్ ఫుల్ మూవీ సీక్వెల్ లో భాగం కావడంతో సినిమా పై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సీక్వెల్ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హనుమాన్ సినిమాని నిర్మాణ పరంగా కొన్ని పరిమితులతో తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఈ సీక్వెల్ కి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద సంస్థ, రిషభ్ శెట్టి లాంటి హీరో తోడవ్వడంతో సినిమా ను మరింత అద్భుతంగా తెరకెక్కించబోతారని అంత మాట్లాడుకుంటున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి తీసుకరాబోతున్నట్లు సమాచారం.
Read Also : Women’s Health : మహిళల ఆరోగ్యం, గర్భధారణకు సరైన వయస్సు ఏది? ఆలస్యమైతే ఈ ప్రమాదం ఖాయం!