కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా ప్రీక్వెల్ ని చేస్తున్నాడు. కాంతారా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో భారీ క్రేజ్ ఏర్పరచుకున్న రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ (Jai Hanuman) సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి నటించనున్నాడు. ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం భారీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇదిలాఉంటే రిషబ్ శెట్టి (Rishab Shetty) మరో సినిమాను కూడా ఓకే చేశాడని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments) బ్యానర్ లో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. డైరెక్టర్ గా యువ దర్శకుడిని ఫైనల్ చేశారని టాక్. కన్నడ హీరో అయిన రిషబ్ కి కాంతారాతో తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా రిలీజ్ టైం లోనే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిషబ్ తో తెలుగులో సినిమా చేస్తానని చెప్పారు. కానీ ఎందుకో అది వర్క్ అవుట్ అవ్వలేదు.
తెలుగు సినిమాలు చేసినా..
కానీ ప్రశాంత్ వర్మ హనుమాన్ గా రిషబ్ ని ఫిక్స్ చేశాడు. ఇప్పుడు మరో సినిమా కూడా రిషబ్ కోసం రెడీ చేసి ఓకే చేశారు. చూస్తుంటే రిషబ్ తెలుగులో కూడా వరుస సినిమాలు చేసేలా ఉన్నాడు. ఐతే తానెంత తెలుగు సినిమాలు చేసినా ఆయన ఒక కన్నడ నటుడే అంటూ తను చెప్పుకొచ్చాడు. మిగతా వారిలా వేరే భాషలో అవకాశాలు రాగానే అక్కడకు వెళ్లనని ఆమధ్య ఒక కామెంట్ చేశారు రిషబ్ శెట్టి.
ఏది ఏమైనా రిషబ్ శెట్టి చేస్తున్న తెలుగు ప్రాజెక్ట్ లకు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. సితార బ్యానర్ లో చేసే సినిమా కూడా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.
Also Read : Toyota Kirloskar Motor : భారతదేశంలో 1,00,000 ఇన్నోవా హైక్రాస్ యూనిట్ల విక్రయాలు..