పూజాతో ప్ర‌భాస్ అప్ సెట్

  • Written By:
  • Updated On - September 27, 2021 / 01:01 PM IST

పూజా హెగ్డే తో ప్ర‌భాస్ అప్ సెట్ అయ్యాడా? రాధేశ్యామ్ చిత్రంలో పూజా కో ఆప‌రేట్ చేయ‌లేదా? ప్ర‌భాస్ అప్ సెట్ వెనుక కార‌ణం ఏంటి? ఇక తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో పూజాకు మార్కెట్ ఉండ‌దా? ఇలాంటి గాసిప్స్ టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. వీటికి రాధేశ్యామ్ టీం క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. కానీ, ఆ గాసిప్స్ మాత్రం ఆగ‌డంలేదు.

ఫుల్ ల‌వ్ స్టోరీ రాధేశ్యామ్..ప్ర‌భాస్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లు. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్త‌యింది. ఆ సినిమా విడుద‌ల కాకుండానే ప్ర‌భాస్, పూజా మ‌ధ్య షూటింగ్స్ లో గాప్ వ‌చ్చింద‌ని పుకార్లు. పూజా మూమెంట్స్ తో ప్ర‌భాస్ అప్ సెట్ అయ్యాడ‌ని గాసిప్. దానికి చెక్ పెడుతూ మ‌రో సినిమాలో ప్ర‌భాస్, పూజూ న‌టించ‌బోతున్నార‌ని రాధేశ్యామ్ చిత్రం యూనిట్ స్ప‌ష్టం చేసింది.
సాధార‌ణంగా ప్ర‌భాస్ కో స్టార్స్ తో చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటాడ‌ని టాలీవుడ్ టాక్. కో స్టార్స్ తో చాలా స్నేహంగా ఉండ‌డ‌మే కాకుండా న‌వ్విస్తూ..జోవియ‌ల్ గా ఉంటాడ‌ట‌. పూజా విష‌యంలోనూ అలాగే ప్ర‌భాస్ మూవ్ అయ్యాడంట‌. సో..గాసిప్స్ త‌ప్ప నిజంగా ప్ర‌భాస్ కు, పూజాకు మ‌ధ్య ఏమీ గ్యాప్ లేద‌ని సినిమా యూనిట్ తేల్చేసింది.