RGV నిన్న మొన్నటిదాకా పొలిటికల్ ఎజెండాతో కొన్ని సినిమాలు చేసి సందడి చేసిన సంచలన దర్శకుడు ఆర్జీవి ఏపీలో ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి తను కూడా ఇప్పుడు ఒక దర్శకుడిని అని గుర్తు చేసుకున్నాడు. ఈమధ్యనే తను ఇక మీదట సినిమాలనే చేస్తా అంటూ కొత్త వారిని ఎంకరేజ్ చేస్తా అంటూ అనౌన్స్ చేసిన ఆర్జీవి ఇప్పుడు తెలుగు దర్శకులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
మే 19న డైరెక్టర్స్ డే ని జరుపుకుంటున్న సందర్భంగా వేడుకకు సీఎం ని ఆహ్వానించడానికి తెలుగు దర్శకులంతా వెళ్లారు. అయితే అనీల్ రావిపుడి, హరీష్ శంకర్, వశిష్టతో పాటుగా రాం గోపాల్ వర్మ కూడా కనిపించాడు. ఇలా తెలుగు సినీ పరిశ్రమకు సంబందించి పలువురు దర్శకులతో కలిసి ఆర్జీవి కనిపించడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.
చాలాకాలం తర్వాత ఆర్జీవి ఒక దర్శకుడిగా పూర్తిస్థాయిలో కనిపించాడని చెప్పొచ్చు. ఆర్జీవి ఇలా తెలుగు దర్శకులతో సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనక కూడా ఏదో ఒక రీజన్ ఉందని అంటున్నారు. ఆర్జీవి సినిమాలను చూసి అతనికి అభిమానులుగా మారిన ప్రేక్షకులు ఆర్జీవి తెలుగు దర్శకుల తరపున వారితో కలిసి వెళ్లడం చూసి షాక్ అవుతున్నారు.
Also Read : Balakrishna : బాలయ్య 110 కెరీర్ హయ్యెస్ట్ బడ్జెట్.. సూపర్ హిట్ సీక్వెల్ కి ఆమాత్రం లేకపోతే ఎలా..?